Tollywood: టాలీవుడ్‌ హీరోలకు ఛాలెంజ్‌ విసిరిన హైదరాబాద్‌ సీపీ.. హీరోల రియాక్షన్‌ ఏంటంటే.

|

Jun 25, 2023 | 3:51 PM

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఛాలెంజెస్‌ ట్రెండ్ పెరిగింది. రకరకాల అంశాలపై ఒకరికొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. వీటిని స్వీకరించిన వారు మరొకరి విసురుతారు. తాజాగా ఇలాంటి ఓ ఛాలెంజ్‌నే సోషల్‌ మీడియా వేదికగా ట్రెండ్ చేశారు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌. ఒలింపిక్‌ డే సందర్భంగా...

Tollywood: టాలీవుడ్‌ హీరోలకు ఛాలెంజ్‌ విసిరిన హైదరాబాద్‌ సీపీ.. హీరోల రియాక్షన్‌ ఏంటంటే.
Cv Anand
Follow us on

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఛాలెంజెస్‌ ట్రెండ్ పెరిగింది. రకరకాల అంశాలపై ఒకరికొకరు ఛాలెంజ్‌లు విసురుకుంటున్నారు. వీటిని స్వీకరించిన వారు మరొకరి విసురుతారు. తాజాగా ఇలాంటి ఓ ఛాలెంజ్‌నే సోషల్‌ మీడియా వేదికగా ట్రెండ్ చేశారు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌. ఒలింపిక్‌ డే సందర్భంగా హీరోలతో పాటు మరికొందరు సవాల్‌ విసిరారు. దీనికి టాలీవుడ్ యంగ్‌ హీరో అడవి శేష్‌ స్పందించారు.

వివరాల్లోకి వెళితే.. ఒలింపిక్‌ డే సందర్భంగా వర్కవుట్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేసిన సీవీ ఆనంద్‌.. ప్రజలు శారీరక వ్యాయామం చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం. నేటి యువతరం గ్యాడ్జెట్‌లకు అతుక్కుపోతున్నారు’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోను షేర్‌ చేసిన సీవీ ఆనంద్‌.. హీరో నిఖిల్, అడివి శేష్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధులను ట్యాగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

‘మీరు కూడా మీ వర్కవుట్‌ వీడియోలను షేర్‌ చేయడం ద్వారా శారీరక వ్యాయామంపై అవగాహన కల్పించండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై తెలుగు హీరో అడివి శేష్‌ స్పందిస్తూ వర్కవుట్ చేస్తున్న వీడియోను ట్వీట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..