Water Problem: నగరంలో నీటి కష్టాలు.. మీరు ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు అయితే పొదుపు చేయాల్సిందే!

| Edited By: Balaraju Goud

Mar 19, 2024 | 8:29 PM

అసలే ఎండాకాలం ఆపై నీటి కష్టాలు షరా మామూలే. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ మధ్య ఏదో ఒక మూల ఏదో ఒక పైప్‌ లైన్ మరమ్మత్తు పనుల పేరుతో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రాంత వాసులను జలమండలి అప్రమత్తం చేస్తూ ముందుగానే నీటిని పొదుపు చేసుకోవాలని సూచిస్తుంది. ఇప్పుడు మళ్లీ మరొక చోట మరమ్మత్తుల పని పేరిట వాటర్ కట్ కానుంది.

Water Problem: నగరంలో నీటి కష్టాలు.. మీరు ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్లు అయితే పొదుపు చేయాల్సిందే!
Hyderabad Water Problem
Follow us on

అసలే ఎండాకాలం ఆపై నీటి కష్టాలు షరా మామూలే. గ్రేటర్ హైదరాబాద్ లో ఈ మధ్య ఏదో ఒక మూల ఏదో ఒక పైప్‌ లైన్ మరమ్మత్తు పనుల పేరుతో కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రాంత వాసులను జలమండలి అప్రమత్తం చేస్తూ ముందుగానే నీటిని పొదుపు చేసుకోవాలని సూచిస్తుంది. ఇప్పుడు మళ్లీ మరొక చోట మరమ్మత్తుల పని పేరిట వాటర్ కట్ కానుంది.

హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో సింగపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపు లైన్ లోని 350 ఎంఎం డయా స్లూయిస్ వాల్వ్‌కు డ్యామేజీ జరిగింది. ఈ వాల్వ కు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు బుధవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు చేపడతామని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. దీంతో ఈ పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా అయ్యే ప్రాంతాలకు 10 గంటలు నీరు నిలిచిపోనున్నాయి. కాబట్టి అయా ప్రాంతవాసులు అప్రమత్తం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

1. ఓ అండ్ ఎం డివిజన్ 3 : షేక్ పేట్, టోలిచౌకి, గోల్కొండ, భోజగుట్ట రిజర్వాయర్ ప్రాంత పరిధిలో లో ప్రెజర్ సమస్య.

2. ఓ అండ్ ఎం డివిజన్ 18 : గంకడిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాల గూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నంపూర్, మంచిరేవుల.

కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జలమండలి కోరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…