Boeing 777-9 Jet: హైదరాబాద్‌లో ఇంటర్నేషన్‌ ఏవియేషన్‌ షో.. ప్రత్యేక ఆకర్షణగా ఆ విమానం

ఏవియేషన్ రంగాన్ని మరింత ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా2024 ప్రదర్శనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబవుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వింగ్స్ ఇండియా ఈవంట్ నిర్వహించనున్నారు. 4రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ లు...

Boeing 777-9 Jet: హైదరాబాద్‌లో ఇంటర్నేషన్‌ ఏవియేషన్‌ షో.. ప్రత్యేక ఆకర్షణగా ఆ విమానం
Winges India

Edited By: Janardhan Veluru

Updated on: Jan 17, 2024 | 11:28 AM

ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోకి హైదరాబాద్‌ మరోసారి వేదిక కానుంది. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో 4రోజుల పాటు వింగ్స్ ఇండియా2024 పేరుతో భారీ షో నిర్వహించనున్నారు. సివిల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన చేపట్టబోతున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్‌తో పాటు పలు రకాల విమానాలు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఏవియేషన్ రంగాన్ని మరింత ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా2024 ప్రదర్శనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబవుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వింగ్స్ ఇండియా ఈవంట్ నిర్వహించనున్నారు. 4రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ లు కనువిందు చేయనున్నాయి. విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేయడంతో పాటు.. ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు,పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

2022 మార్చి 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బేగంపేటలో నిర్వహించిన వింగ్స్ ఇండియా కార్యక్రమంలో 125 ఎగ్జిబిట్స్‌ను ఉంచారు. 22మంది విదేశీ ప్రతినిధులు ఈ ఏవియేషన్ షో ని విజిట్ చేశారు. 28 రాష్ట్రాల నుంచి పలువురు ప్రాతినిథ్యం వహించారు. వ్యాపార ఒప్పందానికి సంబంధించి 364 సమావేశాలు జరిగాయి. 14 రౌండ్ టేబుల్ మీటింగ్‌లలో 76 మంది వక్తలు ప్రసంగించారు. వింగ్స్ ఇండియాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాళ్లకు 69 అవార్డులు ప్రదానం చేశారు. 2022లో జరిగిన ప్రదర్శన చూసేందుకు 3253 ఏవియేషన్ ఎక్స్పర్ట్స్… 52వేల మంది సాధారణ విజిటర్స్ పాల్గొన్నారు.

ఈసారి జరిగే ఏవియేషన్ షో కి 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా 5వేల మంది ఏవియేషన్ రంగానికి చెందిన బిజినెస్ మాన్ లు హాజరై కొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. 200 విమానాలు ప్రదర్శనకు రానున్నాయి. లక్ష మంది ఈ ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777-9 విమానం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనుంది.బోయింగ్ విమానంతో పాటు,విమానాల ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన బోయింగ్ 777-9 విమానం..

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..