Hyderabad: హైదరాబాద్ స్టార్టప్‌ కంపెనీ వినూత్న ఆలోచన.. అందుబాటులోకి ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు

|

Apr 27, 2023 | 6:17 PM

ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడంలో అంబులెన్స్‌ల సేవల కీలకమనే విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో అత్యంత తక్కువ సమయంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. విదేశాలకు తరలించి చికిత్స అందించాల్సి అవసరం ఉంటుంది. అలాటి సమయాల్లో సాధారణ విమానాల్లో రోగిని...

Hyderabad: హైదరాబాద్ స్టార్టప్‌ కంపెనీ వినూత్న ఆలోచన.. అందుబాటులోకి ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు
Air Ambulance
Follow us on

ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడంలో అంబులెన్స్‌ల సేవల కీలకమనే విషయం తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో అత్యంత తక్కువ సమయంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. విదేశాలకు తరలించి చికిత్స అందించాల్సి అవసరం ఉంటుంది. అలాటి సమయాల్లో సాధారణ విమానాల్లో రోగిని తరలించడం కష్టంతో కూడుకున్న విషయం. ఈ సమస్యను తీర్చడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్ ఆలోచన చేసింది. రెడ్‌.హెల్త్‌ పేరుతో ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు..

హైదరాబాద్‌కు చెందిన రెడ్‌.హెల్త్‌ స్టార్టప్‌ కంపెనీ హైదరాబాద్‌తో పాటు మరో 550 పట్టణాల్లో ఈ ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఎయిర్‌ అంబులెన్సుల్లో అత్యాధుని వైద్య సదుపాయాలను సమకూర్చారు. అంతేకాకుండా క్వాలిఫైడ్ క్రిటికల్ కేర్ ప్రొఫెషనల్స్ సిబ్బంది కూడా ఉంటారు. దేశంలో ఎక్కడి నుంచైనా రోగులను సమర్థవంతంగా తరిలించేందుకు ప్రత్యేక విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌ పోర్ట్‌ వరకు కూడా ఈ సంస్థకు చెందిన అంబులెన్సులు సేవలు అందిస్తాయి.

దేశంలో విమానాశ్రయాలలో 25 కంటే ఎక్కువ విమానాలు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో 10కి పైగా విమానాలు పార్క్ చేయడానికి అనుమతి ఉంది. రాయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి ఎయిర్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రదేశాలతో పాటు దుబాయ్, అబుదాబి, మస్కట్, దోహాలకు కూడా ఈ కంపెనీ ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..