Ganesh Immersion 2023: హైదరాబాద్‌లో రికార్డులు బద్దలు కొట్టేసిన గణేశుడి లడ్డూలు.. అక్కడ ఏకంగా కోటి దాటేసిందిగా..

|

Sep 28, 2023 | 2:10 PM

హైదరాబాద్‌లో గణేశుడి శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. పదకొండు రోజులపాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పటికే గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 6గంటలకు ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. మధ్యాహ్నం 12గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్‌ 4 దగ్గరకు చేరుకుంది. వెల్డింగ్ తొలగింపు, కలశ పూజ అనంతరం మహా గణేషుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.

Ganesh Immersion 2023: హైదరాబాద్‌లో రికార్డులు బద్దలు కొట్టేసిన గణేశుడి లడ్డూలు.. అక్కడ ఏకంగా కోటి దాటేసిందిగా..
Hyderabad Ganesh Laddus
Follow us on

హైదరాబాద్‌లో గణేశుడి శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. పదకొండు రోజులపాటు పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పటికే గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 6గంటలకు ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర.. మధ్యాహ్నం 12గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్‌ 4 దగ్గరకు చేరుకుంది. వెల్డింగ్ తొలగింపు, కలశ పూజ అనంతరం మహా గణేషుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఇక నగరంలోని విగ్రహాలన్నీ నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు తరలివస్తున్నాయి. ఇక నిమజ్జనం ముందు నిర్వహించే లడ్డూల వేలం కోలాహలంగా సాగింది. లడ్డూల వేలానికి సంబంధించి గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన బాలాపూర్ గణేష్‌ లడ్డూ 27లక్షలు పలికింది. గత ఏడాది 24లక్షల 60వేలకు లడ్డూ అమ్ముడుపోయింది. దాసరి దయానంద్ రెడ్డి అనే భక్తుడు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వేలంపాట అనంతరం బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర ఫలక్ నుమా, అలియాబాద్, చార్మినార్, మదీనా, అప్జల్ గంజ్, ఎంజెమార్కెట్, అబిడ్స్ క్రాస్ రోడ్ మీదుగా సాగుతోంది. కాగా బాలాపూర్‌ లడ్డూను దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు దాసరి దయానంద్‌ రెడ్డి. స్వామివారి కృపతోనే వేలంపాటలో లడ్డూ పొందగలిగానన్నారు. అరుదైన అవకాశం దక్కడంపై కుటుంబసభ్యులు సైతం హర్షం ప్రకటించారు.

ఇక హైదరాబాద్ బండ్లగూడలోని రిచ్ మండ్ విల్లాస్ లో గణేశ్ లడ్డూ ధర రికార్డుస్థాయిలో అమ్ముడుపోయింది. లడ్డూను కోటి 26లక్షలతో కొనుగోలు చేశారు భక్తులు. ఇక బడంగ్‌పేట్ గణేశ్ లడ్డూ కూడా రికార్డుస్థాయిలో ధర పలికింది. గతేడాది లడ్డూ వేలంలో 12లక్షల 60వేలు పలికిన లడ్డూ ధర ఈసారి 17లక్షలకు బడంగ్ పేట్ గణేశ్ లడ్డూను దక్కించుకున్నాడు వెంకట్‌రెడ్డి అనే భక్తుడు. ఇక సనత్‌ నగర్‌ అసోసియేషన్‌ గణేష్‌ లడ్డూ వేలంల ఓ రూ. 2.33 లక్షలు పలికింది. లడ్డూనూ అసోసియేషన్‌ సభ్యులు సాయి కిరణ్‌ గౌడ్‌ దక్కించుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ.1.43 లక్షలు పలకగా.. ఈసారి 89 వేలు అధికంగా పలకడం విశేషం. మహా నిమజ్జనోత్సవం సందర్భంగా.. సిటీ అంతా భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. వీటన్నింటినీ.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి.. అక్కడి నుంచి ప్రతీ ప్రాంతంలోని నిమజ్జనోత్సవాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. వెరైటీ గణేశ్ ప్రతిమలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు భక్తులు. చార్మినార్ దగ్గర శోభాయాత్రను ఆపి డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు… భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, పారామిలటరీ బలగాలు భద్రతా ఏర్పాట్లు చేశారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌పై ఆంక్షలు పెట్టారు పోలీసులు. బాలాపూర్‌- హుస్సేన్‌ సాగర్‌ మార్గంలో సాధారణ వాహనాలపై రేపు ఉదయం పదిగంటల వరకు ఆంక్షలు విధించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి