AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై వింత ఆసనం వేసిన యువకుడు.. రీజన్ ఏంటంటే..?

హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని గుంతల రోడ్లపై నిరసనగా యాక్టివిస్ట్ వినయ్ వంగల వేసిన వింత ఆసనం నెట్టింట వైరల్ అయింది. దీంతో చివరికి జీహెచ్ఎంసీ స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టింది. ఆ డీటేల్స్ పూర్తి కథనంలో తెలుసుకుందాం పదండి .. .. ..

Hyderabad: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై వింత ఆసనం వేసిన యువకుడు.. రీజన్ ఏంటంటే..?
Pothole Asana
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2025 | 9:44 PM

Share

శేరిలింగంపల్లిలో రోడ్ల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతోంది. పెద్ద పెద్ద గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, అధికారులు పట్టించుకోకపోవడంతో ఒక యువకుడు వినూత్నంగా నిరసన తెలిపారు. వినయ్ వంగల అనే యాక్టివిస్ట్ ఒక పెద్ద గుంతపై యోగా ఆసనంలో నిల్చొని నిరసన తెలిపారు. ఈ నిరసనకు ఆయన ‘పోత్‌హోల్ ఆసన’ అని పేరు పెట్టారు. గుంతల వల్ల ప్రజలు ప్రతిరోజూ పడుతున్న ఇబ్బందులను ఆయన నిరసన ద్వారా చూపించారు.

“ఇక్కడి గుంతలపై రెండు నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నా GHMC స్పందించలేదు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇందిరా, డిప్యూటీ ఇంజనీర్ శ్రీదేవి వంటి అధికారులపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలి,” అని వినయ్ డిమాండ్ చేశాడు.

GHMC చెప్పినట్టు 7,000 గుంతలు పూడ్చారేమో కానీ, శేరిలింగంపల్లిలో మాత్రం గుంతలు తగ్గకపోవడం బాధాకరం అని విమర్శించారు. #PotholeAsana హ్యాష్‌ట్యాగ్‌తో అతను ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో.. చాలా మంది నెటిజన్స్ అతనికి మద్దతుగా పోస్ట్‌లు పెట్టారు. వినయ్ నిరసన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో చివరికి GHMC అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో గుంతలు పూడ్చారు.

ఈ రోడ్లు వాహనాలే కాదు, మన ఆరోగ్యానికీ నష్టం చేస్తున్నాయని వినయ్ చెబుతున్నారు. రోజూ ఈ గుంతలపై వెళ్లేవారికి నడుము నొప్పులు రావడం జరుగుతుందని.. కొందరు ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడించాడు. ఎట్టకేలకు అతని నిరసన ఫలించి.. అక్కడి గుంతలు పూడాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఫ్రిజ్ లేకపోయినా పచ్చిమిర్చి నెలల తరబడి తాజాగా ఉండాలా?
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా