AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రాణాలు తీసిన మృత్యు దారి.. 17 మంది మృతులు వీరే..

చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక బిల్డింగ్‌లో ప్రమాదం జరిగితే ఇన్ని ప్రాణాలు బలవ్వాల్సిందేనా.. బయటకు వచ్చే సరైన మార్గం లేకే వారంతా ప్రాణాలు కోల్పోయారా అంటే అవుననే అంటున్నాయి అక్కడి పరిస్థితులు..

Hyderabad: ప్రాణాలు తీసిన మృత్యు దారి.. 17 మంది మృతులు వీరే..
Charminar Fire Accident
Shaik Madar Saheb
|

Updated on: May 18, 2025 | 2:52 PM

Share

చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. చార్మినార్‌కి దగ్గర గుల్జార్‌ హౌస్‌కి సమీపంలో ఉన్న భవనంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులున్నారు.. వారిలో ఏడాదిన్నర చిన్నారి, ఏడేళ్ల చిన్నారి, నాలుగేళ్ల పిల్లలు ఆరుగురు ఉన్నారు. అయితే.. ఆ బిల్డింగ్‌కు వెళ్లడానికి ఒక సొరంగం నుంచి వెళ్లినట్లుగా ఉంటుంది మార్గం. జీ ప్లస్ 2 బిల్డింగ్‌లో పైకి ఎక్కడానికి మెట్లు చాలా ఇరుకుగా ఉంటాయని పోలీసులు తెలిపారు. ఫైర్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన ప్రకారం.. ఉదయం 06:16 గంటలకు చార్మినార్‌లోని గుల్జార్ హౌస్ చౌరస్తాలోని G+2 భవనంలో మంటలు చెలరేగాయని సమాచారం వచ్చింది.. మొఘల్‌పురా ఫైర్ సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు.. భవనం G+2 అంతస్తులను కలిగి ఉంది.. గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి.. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు ఒకేసారి జరిగాయి.. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించామని.. ఫైర్‌ డీజీ నాగిరెడ్డి తెలిపారు. కిటికీలోంచి నలుగురిని బయటకు తీసుకొచ్చారు.. భవనం గోడ పగలగొట్టి లోపలికి వెళ్లారు ఫైర్ ఫైటర్స్‌.. అప్పటికే 17 మంది పొగతో ఊపిరాడక ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్పాట్‌లో ముగ్గురు.. ఆస్పత్రుల్లో 14 మంది మృతి చెందారు. అత్యంత ఇరుకైన దారే మృతులు పెరగడానికి కారణంగా మారింది.

మృతులు వీరే..

  1. ప్రహ్లాద్ 70 సంవత్సరాలు
  2. మున్నీ 70 సంవత్సరాలు
  3. రాజేంద్ర మోడీ 65 సంవత్సరాలు
  4. సుమిత్ర 60 సంవత్సరాలు
  5. హామీ 7 సంవత్సరాలు
  6. అభిషేక్ 31 సంవత్సరాలు
  7. శీతల్ 35 సంవత్సరాలు
  8. ప్రియాంష్ 4 సంవత్సరాలు
  9. ఇరాజ్ 2 సంవత్సరాలు
  10. అరుషి 3 సంవత్సరాలు
  11. రిషబ్ 4 సంవత్సరాలు
  12. ప్రథమ్ 18నెలలు
  13. అనుయన్ 3 సంవత్సరాలు
  14. వర్ష 35 సంవత్సరాలు
  15. పంకజ్ 36 సంవత్సరాలు
  16. రజని 32 సంవత్సరాలు
  17. ఇద్దు 4 సంవత్సరాలు

మొత్తం 8 కుటుంబాల్లో 17 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

అగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో మరియు చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు. మంటలను ఆర్పడానికి మొత్తం 2 గంటలు పట్టిందని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశామని పేర్కొన్నారు. అడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించారు.. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది… దర్యాప్తు చేస్తున్నాం, దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదని.. తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం వెల్లడించింది.

చాలెంజింగ్‌గా మారిన రెస్క్యూ..

ప్రమాదం జరిగిన బిల్డింగ్‌కు వెళ్లడానికి ఒక సొరంగం నుంచి వెళ్లినట్లుగా ఉంటుంది మార్గం. జీ ప్లస్ 2 బిల్డింగ్‌లో పైకి ఎక్కడానికి మెట్లు చాలా ఇరుకుగా ఉంటాయి. ప్రమాద సమయంలో బాధితులను రక్షించడం రెస్క్యూ టీమ్‌కు చాలెంజింగ్‌గా మారింది. బయటకు చూస్తే నిర్మాణం G ప్లస్ 1, కాని లోపల ఉన్నది మాత్రం జీ ప్లస్ 2. ఈ క్రమంలో వేగంగా లోపలకు వెళ్లేందుకు గోడకు రంధ్ర చేశారు ఫైర్ ఫైటర్స్.. ఫైర్‌ డీజీ నాగిరెడ్డి కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. ఇరుకైన మార్గమే 17 మంది ప్రాణాలు బలిగొంది అన్నారు. బయటకే వెళ్లే మార్గం వెడల్పు కూడా ఉంటే ఇంత మంది చనిపోయే వారు కాదమో అన్నారు నాగిరెడ్డి. ప్రమాద సమయంలో బాధితులు తప్పించుకునే మార్గమే లేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..