Hyderabad Crime News: క్షణికావేశంలో కొంతమంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబం గురించి ఆలోచించకుండా విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా.. భార్య మందలించిందనే కారణంతో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాయి. ఈ విషాద సంఘటన హైదరాబాద్ (Hyderabad) లో చోటుచేసుకుంది. భార్య మందలించిందని మనస్తాపంతో జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగి అంజయ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అల్వాల్ ప్రాంతంలోనలి జొన్నబండలో జరిగింది. అల్వాల్ పోలీసులు (alwal police) తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నబండలో నివసించే అంజయ్య(32) జీహెచ్‌ఎంసీ (GHMC) లో చెత్త తరలింపు వాహన డ్రైవర్‌గా కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే.. అంజయ్య కొంతకాలం క్రితం తండ్రి, తమ్ముడి వద్ద కొంత అప్పు తీసుకొని ఇల్లు నిర్మించుకున్నాడు. అయితే తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించక పోవడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అంజయ్య తమ్ముడు.. వదిన లక్ష్మమ్మతో గొడవపడ్డాడు. అనంతరం సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త అంజయ్యకు ఆమె గొడవ గురించి వివరిస్తూ అంజయ్యను గద్దించింది. ఈ గొడవకు కారణంగా తనేనంటూ కోప్పడటంతో.. అంజయ్య తీవ్ర మనస్తాపం చెందాడు.
అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అంజయ్య ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అల్వాల్ పోలీసులు తెలిపారు.
Also Read: