Hyderabad – HMWSSB : భాగ్యనగర వాసులూ బీ అలర్ట్. వాటర్ సప్లయ్‌కి సంబంధించి హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు కీలక ప్రకటన జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మంచి నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనను నగర వాసులు గమనించాల్సిందిగా కోరారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బి ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట స్మశాన వాటిక ఎదురుగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున అక్కడ ఉన్న 1000 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్‌ను మరో చోటకు మార్చాల్సి ఉంది. దీంతో పాటు సఫ్దార్ నగర్ సమీపంలోని నాలా క్రాసింగ్ వద్ద 1000 ఎంఎం డయా పీఎస్‌సీ పైప్‌లైన్‌ను 1000 ఎంఎం డయా ఎంఎస్ పైప్‌లైన్‌గా మార్చాల్సి ఉంది. 15/11/2021 తేదీ అంటే సోమవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ 16/11/2021 మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ మరమ్మతు పనులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో 24 గంటల వరకు జలమండలి ఓఆండ్ఎమ్ డివిజన్ – 6, డివిజన్ – 9 పరిధిలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6: – ఎర్రగడ్డ, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్‌నగర్, వెంగళ్‌రావునగర్, సోమాజిగూడ, వెంకటగిరి సెక్షన్‌ల పరిధిలోని ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9: – మూసాపేట సెక్షన్ పరిధిలోని పాండురంగనగర్, కబీర్‌నగర్ ప్రాంతాలు.
ఈ నోటీసును పరిగణనలోకి తీసుకుని.. నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. ముందు రోజే సరిపడా నీటిని పట్టిపెట్టుకోవాలని ప్రజలను అధికారులు కోరారు.
Also read:
Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..
Suriya JaiBhim: మంత్రి చేసిన ఆరోపణలను ఖండించిన సూర్య.. జైభీమ్ గురించి ఆసక్తికర విషయాలు..