హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మియాపూర్, కొండాపూర్, మేడ్చల్, దుండిగల్, సూరారం, కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట, హైదర్‌నగర్, సుచిత్ర తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా రాబోయే మూడు గంటల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. అలాగే అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు కోరారు. కాగా హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మెదక్ జిల్లావ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. కాగా సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..