రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణలో ఉన్న పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ లోను చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపిస్తుంది. ఆదివారం మొత్తం రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. రోజుల తరబడి కురవాల్సిన వర్షపాతం మొత్తం ఒకేరోజు నమోదయింది. దీంతో చాలా చోట్ల కరెంటు కొరతతో పాటు చెట్లు నేల కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే నిరంతరంగా వర్షం కురుస్తూ ఉండటంతో ఇంట్లో నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొని ఉంది. ఈ తరుణంలో ప్రజలకు ఉపయోగపడే వివిధ శాఖల ఫోన్ నెంబర్లు ఉన్నాయి.
ఏదైనా సమస్య గురించి జిహెచ్ఎంసి కి కాల్ చేయాలనుకుంటే జిహెచ్ఎంసి కంట్రోల్ నెంబర్ 9704601866 నెంబర్ కు కాల్ చేయండి. అలాగే భారీ వర్షాలకు మీ ప్రాంతంలో ఎక్కడైనా చెట్లు కూలిపోయినట్లయితే జీహెచ్ఎంసి ట్రీ కటింగ్ నంబర్ 6309062583 కాల్ చేయవచ్చు. ఇక భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ లోతటి ప్రాంతాల్లో ఉన్న ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. కొన్ని ప్రాంతాల్లో సెల్లార్లలోను పూర్తిగా వాటర్ లాగ్ అయిపోయిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వర్షపు నీటిని తొలగించేందుకు 9000113667 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు
ఇక విద్యుత్ కి సంబంధించి భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూమ్ కు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.7382072106 నంబర్ కు ఫోన్ చేసి విద్యుత్ పైన ఫిర్యాదులు చేయవచ్చు. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కి సంబంధించి 9704601866 నంబర్ ఫోన్ చేయండి.
భారీ వర్షాలు అనే నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. మరోవైపు సైబరాబాద్ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సైబరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ జోయల్ డెవిస్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి