తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు (సెప్టెంబర్ 14న) పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని తెలిపింది. ఈ వాయుగుండం సోమవారం ఉదయం ఉత్తర కోస్తా… ఒడిశా వద్ద చాంద్‌బలీకి పశ్చిమ వాయువ్య దిశగా 20 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు తెలిపింది.
రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ మీదుగా ప్రయాణించి.. 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వివరించింది. ఇక రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నట్టుగా పేర్కొంది. ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఇక ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక నిన్న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్‌లో వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక నిన్న కురిసిన వర్షానికి మరోసారి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ కంటెస్టెంట్స్‌పై శ్వేత ఉగ్రరూపం..