Governor-MLC: ఆమోదం ఇప్పుడప్పుడే కాదు.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు

కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నియ‌మించాల‌ని రాష్ట్రప్రభుత్వం సిఫార్సును గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

Governor-MLC: ఆమోదం ఇప్పుడప్పుడే కాదు..  కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
Telangana Governor Tamilisai Soundararajan

Edited By: Balaraju Goud

Updated on: Sep 08, 2021 | 2:31 PM

కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నియ‌మించాల‌ని రాష్ట్రప్రభుత్వం సిఫార్సును గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సామాజిక సేవ చేసినవాళ్లకే MLC పదవి ఇవ్వాలి కానీ అంటూ ప్రభుత్వం పంపించిన ఫైల్‌ను పక్కన పెట్టినట్లుగా సమాచారం. కాంగ్రెస్ నుంచి TRSలో చేరిన హుజురాబాద్ నేత కౌశిక్ రెడ్డిని గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీగా నియ‌మించాల‌ని క్యాబినెట్ గ‌వ‌ర్న‌ర్ కు సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చేసి నెల రోజులు కావొస్తున్నా ఇంత వ‌ర‌కు దీనిపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. అయితే, మంత్రివ‌ర్గం సిఫార్సుల‌ను ఆమోదించాల్సి ఉన్న‌ప్ప‌టికీ… కౌశిక్ రెడ్డిపై ప‌లు కేసులున్నాయి.

దీంతో ఆ ఫైలు ఇంకా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్దే పెండింగ్ లో ఉంది. తాజాగా దీనిపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై స్పందించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా గుర్తించాలంటూ క్యాబినెట్ చేసిన సిఫార్సు ఫైల్ త‌న వ‌ద్దే పెండింగ్ లో ఉంద‌ని.. ఆ ఫైల్ విష‌యంలో నాకు కొంత స‌మ‌యం కావాల‌ని కోరినట్లుగా తెలుస్తోంది.

ఈ ఫైల్ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ న్యాయ నిపుణుల స‌ల‌హా తీసుకుంటున్నార‌ని, అందుకే నిర్ణ‌యం ఆల‌స్యం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు