గోషామహల్ చాక్నవాడి లో మళ్లీ కుంగిన రోడ్డు.. డిసిఎం బోల్తా.. గతేడాది కోట్లు వెచ్చించి..

|

Jul 28, 2024 | 1:02 PM

గత ఏడాది క్రితమే ఐదు కోట్లు వెచ్చించి ఇక్కడి నాలపై రోడ్డు నిర్మాణం చేపట్టారని, ఏడాది గడవకముందే మరోసారి రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. నాసిరకం పనుల కారణంగా

గోషామహల్ చాక్నవాడి లో మళ్లీ కుంగిన రోడ్డు.. డిసిఎం బోల్తా.. గతేడాది కోట్లు వెచ్చించి..
Dcm Lorry Overturned
Follow us on

హైదరాబాద్ గోషామహల్‌లో పెను ప్రమాదం తప్పింది. గోషామహల్‌ చాక్నవాడిలో ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో ఒక డీసీఎం వాహనం బోల్తా పడింది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత ఏడాది ఇదే స్థలంలో రోడ్డు కుంగిపోయిన ఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదు కోట్లు వెచ్చించి ఇక్కడి నాలపై రోడ్డు నిర్మాణం చేపట్టారని, ఏడాది గడవకముందే మరోసారి రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. నాసిరకం పనుల కారణంగా రోడ్డు కుండిపోయిందంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..