Good News: తెలంగాణలోని ఆ ప్రభుత్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే పీఆర్సీ అమలు

|

Nov 17, 2021 | 3:07 PM

జ‌ల‌మండ‌లి ఉద్యోగుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులు అంద‌రికీ పీఆర్సీ..

Good News: తెలంగాణలోని ఆ ప్రభుత్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే పీఆర్సీ అమలు
Telangana Govt News
Follow us on

Telangana News: జ‌ల‌మండ‌లి ఉద్యోగుల‌కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. బోర్డులో ప‌ని చేస్తున్న‌ ఉద్యోగులు అంద‌రికీ పీఆర్సీ అమ‌లు చేయ‌డానికి ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది. ఈ నెల నుంచే జ‌ల‌మండ‌లి ఉద్యోగులకు పీఆర్సీ అమ‌లు కానుంది. న‌వంబ‌రు నుంచే పెంచిన వేత‌నాల‌ను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తమకు పీఆర్సీ ఇవ్వాలని జలమండలి ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌పై జలమండలి ఉద్యోగులు గత నెలాఖరులో ఖైరతాబాద్ జలమండలి ఎదుట నిరసన చేపట్టారు. అన్ని శాఖల వారికి పీఆర్సీ ఇస్తున్న ప్రభుత్వం.. తమకు ఎందుకివ్వడంలేదని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జలమండలిలో పనిచేస్తున్న దాదాపు 4 వేల మంది ఉద్యోగులకు వేతన పెంపు లభించనుంది.

Also Read..

Shirdi Temple: కోవిడ్ కేసులు తగ్గుముఖం.. రోజుకు షిర్డీ ఆలయ దర్శనానికి మరో 10వేల మంది భక్తులకు అనుమతి..

Bigg Boss 5 Telugu: స్నేహితుల మధ్య గొడవ రాజేసిన కెప్టెన్సీ టాస్క్‌.. కాజల్‌, మానస్‌లపై మండిపడ్డ సన్నీ..