Hyderabad: ప్రేమికులకు అలెర్ట్.. ఇకపై పార్కుల్లో పాడు పనులు కుదరవ్.. సీసీ కెమెరాలు వస్తున్నాయ్

|

Nov 02, 2022 | 1:08 PM

పార్కులకు వెళ్లే ప్రేమ జంటలకు ఇది చేదువార్తే అని చెప్పవచ్చు. ఎందుకంటే జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో వారికి ఇబ్బందిగా మారనుంది.

Hyderabad: ప్రేమికులకు అలెర్ట్.. ఇకపై పార్కుల్లో పాడు పనులు కుదరవ్.. సీసీ కెమెరాలు వస్తున్నాయ్
CCTV Cameras in Parks
Follow us on

ఏ పార్కులో చూసిన ఏమున్నది గర్వకారణం.. సమస్తం ప్రేమ పక్షుల నిలయం అన్న చందంగా తయారైంది పరిస్థితి హైదరాబాద్‌లోని కొన్ని పార్కుల పరిస్థితి. నగరంలో పార్కులకు కొదువ లేదు. అలాగని ప్రేమ జంటలకూ కూడా కొదువ లేదు. అలసి సొలసి కాసింత సేద తీరుదామని పార్కులకు వెళ్లే సగటు నగర జీవికి ఇబ్బందిగా మారుతోంది. ప్రేమ జంటల రూపంలో ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా వీలు లేకుండా పోతోంది. హైదరాబాద్ నగరంలో సాధారణంగానే కొన్ని పార్కులకు కుటుంబ సమేతంగా వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అన్ని పార్కుల్లో కాదు ముఖ్యంగా ఇందిరా పార్క్ లాంటి పార్కుల్లో కొందరు ప్రేమికులు బహిరంగంగా రొమాన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. మరికొన్ని జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కుల్లో అయితే చైన్ స్నాచింగ్ ఘటనలను మనం చాలా సార్లు చూసి ఉంటాం.

దీంతో ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయించుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ సీసీ కెమెరాలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు 8 వేల కెమెరాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు బుధవారం నాడు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం రూ.19.18 కోట్ల పనులను జీహెచ్ఎంసీ ఈఈఎస్‌ఎల్‌ కంపెనీకి ఇచ్చింది. ఈ కంపెనీ నగరంలోని విస్తరిత ప్రాంతాలతో పాటు మురికివాడలు, పార్కుల్లో 8వేల కెమెరాలను ఏర్పాటు చేయనుంది.

భద్రత ప్రమాణాలను మరింత పటిష్టపరచేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఉన్న 7.50 లక్షల సీసీ కెమెరాలకు అదనంగా 8వేలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఈఈఎస్‌ఎల్‌ కంపెనీకి పనుల బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం జరిగే స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం