GHMC Mayor Election: గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మీ.. డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ఎన్నిక
ఆది ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీ విధేయులకే వరించింది. జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది.
GHMC Mayor 2020 Winner: ఆది ముందు నుంచి అందరూ ఊహించినట్లే మేయర్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీ విధేయులకే వరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తి అయ్యింది. అది నుంచి టెన్షన్‌కు గురిచేసిన మేజిక్ ఫిగర్ లెక్క తేలడంతో.. చివరికి టీఆర్ఎస్ పార్టీనే పైచేయి సాధించింది. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకుని చారిత్రాత్మక నగరంపై మరోసారి గులాబీ జెండా ఎగరేసింది.
టీఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభపక్ష నేత కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మిని జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నియ్యారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయలక్ష్మి బంజారాహిల్స్ డివిజన్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించగా.. శ్రీలత తార్నాక నుంచి గెలుపొందారు. విజయలక్ష్మి ఎన్నికతో ఆమె ఇంటి వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది. ఆమె మేయర్‌గా ఎన్నిక కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి మేయర్ పదవి దక్కిన వారిలో రెండోవారు అయ్యారు. 1961లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచిన ఎంఆర్ శ్యామ్‌రావు మేయర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
రాజకీయ, సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని వ్యూహత్మకంగా వ్యవహరించిన గులాబీ బాస్ కేసీఆర్ చివరి నిమిషంలో కేకే కుమార్తెను ఖరారు చేశారు. కాగా గ్రేటర్ బరిలో ప్రధానంగా నిలిచిన అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎంలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 150 స్థానాలకు కాగా.. టీఆర్ఎస్ నుంచి 56 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఎంఐఎంకు 44 మంది కార్పొరేటర్లు, ఇక బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతో టీఆర్‌ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేజిక్కించుకుంది.
Also Read:
GHMC Mayor Election : గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మీ… డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత