అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు.. లాప్‌ట్యాప్‌లు, రూ. 3 కోట్లు స్వాధీనం: సీపీ సజ్జనార్‌

|

Feb 08, 2021 | 1:26 PM

అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ముఠా సభ్యుల నుంచి నాలుగు ల్యాప్‌టాప్‌, మొబైళ్లు..

అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు.. లాప్‌ట్యాప్‌లు, రూ. 3 కోట్లు స్వాధీనం: సీపీ సజ్జనార్‌
Follow us on

అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ముఠా సభ్యుల నుంచి నాలుగు ల్యాప్‌టాప్‌, మొబైళ్లు, రూ.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సీసీసీవో లింక్‌ పేరుతో సోషియల్‌ సైట్‌లో వైరస్‌ చేయడంతో వీరిని పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు చైనాకు చెందిన వారు పరారీలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వివరించారు.

అలాగే రెండు ఫేక్‌ కంపేనీలు సృష్టించి, ఓ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. షేరింగ్‌ ఎకనామీ పేరుతో దేశ వ్యాప్తంగా డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.90 రోజుల్లో మీరు పెట్టుబడి పెట్టిన సొమ్ముకు 12 శాతం వడ్డీ ఇస్తామని వీరు పలువురిని నుంచి డిపాజిట్లు రాబట్టుకుంటున్నారని పేర్కొన్నారు. మొత్తం స్కీమ్‌ పేరుతో డిపాజిట్ల రూపంలో డబ్బులు రాబట్టుకుంటున్నట్లు వెల్లడైంది. వీరు బెంగళూరు, కాన్పూరు, హైదరాబాద్‌లలో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అరెస్టు అయిన నిందితులు ఉదయ్‌ ప్రతాప్‌, నితీష్‌ కుమార్‌ కొఠారి, రాజేష్‌ శర్మ లుగా గుర్తించారు. వీరు దేశ వ్యాప్తంగా రూ.50 కోట్ల వరకు డిపాజిట్లు జమ చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు.

Also Read: Woman Cheated: హౌసింగ్‌, ఎస్సీ కార్పోరేషన్‌ రుణాల పేరుతో ఓ మహిళ మోసం.. పోలీసులకు ఫిర్యాదు