AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేటర్‌ పీఠంపై అందరి కళ్లు దారుస్సలాం వైపే.. ఈ నెల 11న మజ్లీస్‌ పార్టీ కీలక సమావేశం

గ్రటర్ హదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అందరికకళ్లు..

గ్రేటర్‌ పీఠంపై అందరి కళ్లు దారుస్సలాం వైపే.. ఈ నెల 11న మజ్లీస్‌ పార్టీ కీలక సమావేశం
K Sammaiah
|

Updated on: Feb 08, 2021 | 1:45 PM

Share

జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అందరికకళ్లు మజ్లీస్‌ పార్టీ వైపే మళ్లుతున్నాయి. బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేదు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికపై మజ్లీస్‌ పార్టీ మద్దతు కీలకంగా మారింది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో మజ్లీస్‌కు దోస్తీ ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. మరోవైపు గత ఫలితాలు గ్యారంటీ అని ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌కు నిరాశే ఎదురైంది. అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, మజ్లీస్‌ పార్టీల మధ్య మద్దతు అనివార్యంగా మారింది. బల్దియాలో మజ్లిస్‌ సంఖ్యా బలం 44 మంది కార్పొరేట్లరతో పాటు 10 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు కలుపుకుని 54 మంది ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా.. కోరం సంఖ్య 97. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలుపుకొంటే టీఆర్‌ఎస్‌ సంఖ్యాబలం 88కు మించదు. దీంతో మజ్లిస్‌ మద్దతు అనివార్యంగా మారింది.

ఇక బీజేపీకి మజ్లిస్‌ మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలాగే టీఆర్‌ఎస్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకూ ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇందుకు వ్యతిరేకంగానూ ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పాల్గొనే అంశంపై మజ్లిస్‌ తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్‌ చేయడమా? మొత్తానికే గైర్హాజర్‌ కావడమా అనే అంశాలపై ఈ నెల 11న చర్చించనుంది.

అయితే మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రక్రియకు దూరం ఉండాలని మజ్లిస్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్‌ ఎన్నికల కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగడమా? ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావడమా? అనే అంశాలపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఈ నెల 11న కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టతనిచ్చే అవకాశముంది.

Read more:

సంగీతానికి చింతకాయలు రాలవు.. ఉద్యోగంలో ఉంటావా.. పోతావా..? అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

కోడెల శివప్రసాదరావు కుమారుడికి లిక్కర్‌ డబ్బులు లేవా..? పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత