Yerneni Sita Devi: మాజీ మంత్రి సీతాదేవి కన్నుమూత.. ఎన్టీఆర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా..

|

May 27, 2024 | 11:59 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సీతాదేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు మండలం కోడూరు గ్రామం..

Yerneni Sita Devi: మాజీ మంత్రి సీతాదేవి కన్నుమూత.. ఎన్టీఆర్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా..
Yerneni Seetha Devi
Follow us on

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం ఉదయం గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సీతాదేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు మండలం కోడూరు గ్రామం.. యెర్నేని సీతాదేవి ముదినేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985,1994లలో ముదినేపల్లి ఎంఎల్ఏగా పనిచేశారు. 1988లో ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు) కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కాగా.. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.

సీతాదేవి మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు..

సీతాదేవి మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాప్రతినిధిగా.. విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్రవేశారంటూ చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

రాజకీయ నేపథ్యం..

యెర్నేని సీతాదేవి కుటుంబం ముందు నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నదే.. సీతాదేవి భర్త నాగేంద్రనాథ్‌ (చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా గతంలో పని చేశారు. నాగేంద్రనాథ్‌ ఏడాదే క్రితం కన్నుమూశారు. నాగేంద్రనాథ్‌ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్‌ రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సీతాదేవి నాగేద్రనాథ్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..