
శుభ్రత లేని పరిసరాలు.. నాణ్యతలేని వంట గదులు.. తాజాగా లేని కూరగాయలు.. కుళ్లిపోయిన మాంసం.. కల్తీ నూనెలు.. మసాలా దినుసులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. హోటళ్లు, రెస్టారెంట్లలలో.. ఇక చాంతాడంతా చిట్టా ఉటుంది. ఎన్నిసార్లు తనిఖీలు చేసినా.. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా.. తమకేం పట్టనట్లు హోటల్ యాజామాన్యాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. ఎవరు ఏమనుకున్నా.. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. ఇష్టారీతిన వ్యవహరిస్తూ.. వ్యాపారాన్ని నడిపిస్తున్నారు హోటల్ యజమానులు.. భోజనం ప్రియులకు అపరిశుభ్రమైన వంటకాలను వడ్డిస్తూ వారి సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మూడు పువ్వులు.. ఆరు కాయలుగా తాము చెప్పిందే ఫైనల్ అంటూ హోటల్ యజమానులు ప్రవర్తిస్తున్నారు.. ఎక్కడైనా కల్తీ ఆహారం కనిపించి భోజనం ప్రియులు ప్రశ్నిస్తే వారిపై దాడి చేయడానికి సైతం వెనకాడడం లేదు.. ఇటువంటి సంఘటన తాజాగా.. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల ఎస్ వి బార్ అండ్ రెస్టారెంట్లో జరిగిన ఈ సంఘటన.. చర్చనీయాంశంగా మారింది.
సదాశివపేట పట్టణానికి చెందిన శివ, అతని స్నేహితులు ఫారెన్ రెస్టారెంట్లో సేదతీరుతూ తినడానికి స్టఫ్ ఆర్డర్ ఇచ్చారు. కాసేపటికి వారు చెప్పిన విధంగా ఆహారం రాగానే తిందామని కూర్చున్న వారికి ఆ ప్లేట్లో బొద్దింక దర్శనమిచ్చింది. ఇదేంటి అని అడిగితే తమకు సంబంధం లేదని.. ఏం చేసుకుంటారో చేసుకోమని యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఇలా చెప్పడం సరైనది కాదని వినియోగదారుడు అనగానే సిబ్బంది అతడి పై దాడికి ప్రయత్నించారు. తామే డబ్బులు ఖర్చు పెట్టి అటు ఆరోగ్యంతో పాటు ఇటు భౌతిక దాడులు కూడా ఎదుర్కొంటున్నామని.. కనీస శుభ్రత పాటించకుండా ఇలాంటి కల్తీ ఆహారాన్ని వడ్డిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇంత జరుగుతున్నా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టించుకోవడంలేదని బాధిత వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకటే కాదు జిల్లాలో ఇటువంటి సంఘటనలు ఇప్పటివరకు చాలా జరిగినా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వారికి జరిమానాలు విధిస్తున్నారు.. తిరిగి హోటల్ యాజమాన్యం సదా మామూలే.. మరి కొన్ని హోటల్స్ లో ఏకంగా ఈరోజు మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిజ్‌లలో నిలువ చేసి తిరిగి మరుసటి రోజు వేడి చేసి వినియోగదారునికి అందిస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయని.. ఇప్పటికైనా ఆహార భద్రత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..