హైదరాబాద్‌లోని పంజాగుట్టలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఫ్లైఓవర్ కింది భాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైఓవర్ పిల్లర్లకు ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగలు కమ్ముకోవడంతో వాహనదారులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. అక్కడ ఏం జరుగుతుందే కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. దట్టమైన పొగ చుట్టూరా కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పొగ కారణంగా చుట్టు ప్రక్కల ప్రాంతాలోని కొందరు స్థానికులు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అగ్ని ప్రమాదం నేపథ్యంలో పంజాగుట్ట మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సబంవించినట్లు తెలస్తోంది. ఫ్లైఓవర్ పిల్లరకు ఏర్పాటు చేసిన డెకరేషన్ వస్తువులకు నిప్పు అంటుకోవడం వల్లే మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. నగరంలోని ప్రధాన కూడలిగా ఉన్న పంజాగుట్టలో జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా కలవరపెట్టింది.
మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బొల్లారం వద్ద ఉన్న సాయిరాం వైన్స్ షాపులో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.10 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అందరూ చూస్తుండగా వైన్స్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే మంటల ధాటికి వైన్స్ షాపులో మద్యం సీసాలు పగిలి చెల్లాచెదురైపోయాయి. ఘటన స్థలంలో మూడు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా..?లేక మరేదైన కారణంగా ప్రమాదం జరిగిందా..? అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
Also Read:
PM Kisan: రైతుల ఖాతాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.2 వేలు.. ఈ వివరాలు సబ్మిట్ చేశారో లేదో చూసుకోండి..