AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రాయదుర్గం హైమార్క్‌ ఛాంబర్స్‌ భవనంలో అగ్నిప్రమాదం.. 20 మందిని కాపాడిన బాహుబలి స్కైలిఫ్ట్

హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. భవనంలో ఉన్న వారికి ఊపిరాడక భవనం టెర్రస్‌ పైకి పరుగులు తీశారు. వారిని స్కైలిఫ్ట్ సహాయంతో పోలీసులు కిందకు దించారు.

Hyderabad: రాయదుర్గం హైమార్క్‌ ఛాంబర్స్‌ భవనంలో అగ్నిప్రమాదం.. 20 మందిని కాపాడిన బాహుబలి స్కైలిఫ్ట్
Bahubali Skylift
Ram Naramaneni
|

Updated on: May 28, 2022 | 3:47 PM

Share

హైదరాబాద్‌ రాయదుర్గం(Raidurg) హైమార్క్‌ ఛాంబర్స్‌ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో  దట్టమైన పొగలు అలుముకున్నాయి. బిల్డింగ్‌ రెండో అంతస్తులో మంటలు చెలరేగి మూడో అంతస్తుకు వ్యాపించాయి. హోటల్‌లోని వారు భయంతో పరుగులు తీశారు. ఊపిరాడక కొందరు కిందికి వచ్చేయగా ఇంకొందరు టెర్రస్‌పైకి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.  బిల్డింగ్‌లో చిక్కుకుపోయినవారిని కాపాడేందుకు బాహుబలి స్కై లిఫ్ట్‌ క్రేన్‌ను ఉపయోగించారు ఫైర్‌ ఫైటర్స్‌. 14 మందిని కాపాడటంలో స్కై లిఫ్ట్‌ క్రేన్‌ కీ రోల్ పోషించింది. ఇటీవలే తెలంగాణ(Telangana) ఫైర్‌ డిపార్ట్‌మెంట్ ఈ స్కై లిఫ్ట్‌ను కొనుగోలు చేసింది. ఈ స్కై లిఫ్ట్‌తో 15 అంతస్తుల వరకు చేరుకోవచ్చు. బిల్డింగ్‌ మూడో అంతస్తు అద్దాలను పగులగొట్టి స్కై లిఫ్ట్‌తో 14 మందిని కాపాడారు ఫైర్‌ ఫైటర్స్‌. దట్టమైన పొగ వల్ల ఊపిరాడక ఇబ్బందిపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. 3 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్‌ ఫైటర్స్‌. షార్ట్‌ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. పొగ వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

రెస్క్యూ ఆపరేషన్‌లో బాహుబలి స్కై లిఫ్ట్‌ క్రేన్‌ అందరి దృష్టిని అట్రాక్ట్‌ చేసింది. స్కై లిఫ్ట్‌తో ఫైర్‌ ఫైటర్స్‌ పైకి వెళ్లి బిల్డింగ్‌ అద్దాలు పగులగొట్టడం, టెర్రస్‌ పైన చిక్కుకున్న వారిని కిందకు దించడాన్ని చుట్టు పక్కల ప్రజలు ఆసక్తిగా చూస్తుండిపోయారు. స్కై లిఫ్ట్‌ను తెలంగాణ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఇటీవల కొనుగోలు చేసింది. దాన్ని సమయానికి రప్పించి రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగించారు.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!