AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఆడిపిల్ల వరం.. కానీ వాడికి పుట్టడమే శాపం.. కొట్టడం కాదు చర్మం ఊడొచ్చేలా కొరికి

బిడ్డ ఏడుపు ఆ తండ్రికి రణగొనధ్వనిలా అనిపించింది. ఆ చిన్నారి ఆడపిల్ల కావడమే అందుకు కారణం. దీంతో తండ్రి కాస్తా కర్కోటకుడు అయిపోయాడు.

Hyderabad: ఆడిపిల్ల వరం.. కానీ వాడికి పుట్టడమే శాపం.. కొట్టడం కాదు చర్మం ఊడొచ్చేలా కొరికి
Crime News
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2022 | 9:11 AM

Share

Telangana: ఆడపిల్ల పుట్టడం వరం. చిట్టి తల్లి ఇంట్లో నడయాడతుంటే.. లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే అనిపిస్తుంది. స్త్రీ జాతి లేకపోతే ఈ ప్రపంచ మనుగడే ఉండదన్న నిజాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో కొందరు మూర్ఖులు. తాజాగా  కన్న కూతుర్ని నేలకేసి కొట్టి ప్రాణాలు తీసినంత పని చేశాడో తండ్రి. కొట్టడమే కాదు.. కొరికి చర్మం ఊడేలా చేశాడు ఆ కర్కోటకుడు. కారణం… తనకు ఆడపిల్లలే పుడుతున్నారన్న ఆక్రోశం. చెప్పుకోడానికే భయానకం అనిపించే ఈ పాశవికం హైదరాబాద్ సైఫాబాద్(Saifabad) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసీ ఘట్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  ఆటో డ్రైవర్ బాసిత్ అలీ ఖాన్ – సన దంపతులు వీళ్లు. ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం కూడా. కానీ.. పదేపదే ఆడపిల్లలు పుట్టడంతో అసహనం పెంచుకున్నాడు బాసిత్ అలీ ఖాన్. అప్పుడప్పుడు భార్యాపిల్లలపై తన కోపాన్ని చూపేవాడు కూడా. శనివారం సాయంత్రం అతడి పైశాచికం పరాకాష్టకు చేరింది. పనికి వెళ్లే సమయంలో మూడో కూతురు సకినా ఏడవడంతో కోపగించుకున్నాడు. అతి దారుణంగా కొట్టాడు. గిల్లి శరీరంలో నుంచి మాంసం తీసేసి అతి దారుణంగా దాడి చేసి నేలకేసి కొట్టాడు. ఆ చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తున్నా పట్టించుకోలేదు. ఇలాంటి ఉన్నాదులకు శిక్షలు వేయాలని మొత్తుకునే కన్నా ముందు సమాజంలో మార్పు తేవడానికి ప్రయత్నించండి. ముందు మన ఇంటి నుంచి.. మన కుటుంబం నుంచి ఆడపిల్లపై వివక్ష లేకుండా చూసేందుకు ముందడుగు వేయండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి