హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై అవినీతి ఆరోపణలు వినిపించాయి. గతంలో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్ వ్యవహరించాడు. అతడి హయాంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు.. ఒకరిపై ఒకరు పై చేయి ప్రదర్శించడం తప్పితే ఉప్పల్ స్టేడియం బాగోగులు చూసిన వారే కరువయ్యారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని పూర్తిగా రద్దు చేసి సుప్రీంకోర్టు జస్టిస్ ఎలావు నాగేశ్వరరావు నేతృత్వంలో సింగిల్ మెంబర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిటీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పగ్గాలు చేపట్టిన తర్వాత కాస్తలో కాస్త సమస్య మెరుగుపడిందని అందరూ అనుకున్నారు. అయితే ప్రపంచకప్ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అక్షరాల 117 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వచ్చిన నిధులతో ఉప్పల్ స్టేడియంలోని వసతులను మెరుగుపరచడంతో పాటు గతంలో వచ్చిన విమర్శలను తిప్పికొట్టేందుకు ఏకసభ్య కమిటీ ప్రయత్నించింది.
గతంలో ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ పరమ చెత్తగా ఉందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై వచ్చాయి. అయితే అప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉన్నాడు. కానీ ఇప్పుడు మొత్తం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంతా సుప్రీంకోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ చేతిలోనే ఉంది. సుప్రీంకోర్టు కమిటీ వచ్చాకే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు నిధులు విడుదలయ్యాయి. ప్రపంచకప్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలోని అన్ని పరికరాలను అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. ఫ్లడ్ లైట్లల నుంచి మొదలుకుని ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌ల వరకు అన్నింట్లో కాస్త అభివృద్ధి కనిపించింది. కానీ ప్రేక్షకులు కూర్చునే కుర్చీల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా మారింది. గత ఐపీఎల్‌లో ఎలాంటి దృశ్యాలు మనకు కనిపించాయో.. ఇప్పుడు కూడా అవే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.
Nothing much has changed in Uppal stadium. Only some window dressing and spectator comfort still not taken care of in full.#worldcup2023 pic.twitter.com/RiPyeRsfEn
— C.VENKATESH (@C4CRICVENKATESH) October 3, 2023
ప్రపంచకప్ వార్నప్ మ్యాచ్‌లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులకు సైతం అనుమతి ఉంది. దీంతో మ్యాచ్‌ను తలకించేందుకు వచ్చిన ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు. స్టేడియంలో చాలావరకు కాస్త అభివృద్ధి కనిపించినప్పటికీ ప్రేక్షకులు కూర్చునే సీట్ల పరిశుభ్రతలో మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సరైన చర్యలు తీసుకోలేదని సగటు ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో పలువురు ప్రేక్షకులు అపరిశుభ్రంగా ఉన్న కుర్చీల్లో కూర్చోలేక మ్యాచ్ మొత్తాన్ని నిలబడి తిలకించినట్లు సమాచారం. అపరిశుభ్రంగా ఉన్న కుర్చీల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ అనుభవాలను పంచుకుంటున్నారు ఫ్యాన్స్.
This video is for those doubting thomoses who felt my earlier pics were edited. pic.twitter.com/xmC5ti9hCm
— C.VENKATESH (@C4CRICVENKATESH) October 3, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి