MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌‌పై సర్వత్రా ఉత్కంఠ.. నేడు సుప్రీం కోర్టులో విచారణ..

ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది.

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌‌పై సర్వత్రా ఉత్కంఠ.. నేడు సుప్రీం కోర్టులో విచారణ..
MLC kavitha
Follow us

|

Updated on: Aug 27, 2024 | 10:31 AM

ఢిల్లీ లిక్కర్ పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనుంది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం. ట్రయల్ కోర్టుతోపాటు, హైకోర్టు కూడా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు కవిత.

PMLA సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని ఆమె తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరయిందని.. కవితకు కూడా బెయిల్‌ ఇవ్వాలని కోరుతున్నారు. నేడు ఇరుపక్షాల వాదనలు విననుంది సుప్రీం కోర్టు ధర్మాసనం. మరోవైపు ఈ కేసులో గత విచారణ సమయంలోనే సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా..ఈడీ మాత్రం గడువుకు కోరింది. దీంతో ఆగస్టు 22 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది ధర్మాసనం. సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ విచారణ నేపథ్యంలో కేసీఆర్‌ కుటుంబంతో పాటు బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకుంది. కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.

కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
వరద నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు వైరల్
వరద నీటిలో కొట్టుకుపోతున్న మూగజీవాలు.. హృదయ విదారక దృశ్యాలు వైరల్
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు. ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
భలే భలేగా.. పెన్సిల్ మొనపై బాలగోపాలుడు.. చూస్తే అవాక్!
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
హైదరాబాద్‌లో వింతఘటన.! ఆశ్చర్యపోతున్న జనం.. నెట్టింట వైరల్‌.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రం దొరికింది.! భారీ వజ్రాన్ని 9 భాగాలు..
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
ఏది నిజం.? ఏది అబద్ధం.? సునీతా-విల్ మోర్ ప్రాణాలతో తిరిగొస్తారా.?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?
తిరుమల కొండపై నీటి కష్టాలు! ఈ ఎఫెక్ట్ బ్రహ్మోత్సవాలు మీద పడనుందా?