AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఏందిరా ఇదీ..! చూడటానికి పసుపు ప్యాకెట్లే.. కట్ చేస్తే, లోపల యవ్వారమే వేరు.. వీడియో

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి ఎక్కడ పట్టుబడ్డా.. దాని మూలాలు ధూల్‌పేట్‌కు కనెక్ట్‌ అవుతుండడంతో అక్కడ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. గతంలో గుడుంబాకు అడ్డాగా ఉన్న ధూల్‌పేట్‌ను సమూలంగా ప్రక్షాళించిన పోలీసులు.. ఇప్పుడు.. గంజాయి నిర్మూలన కోసం.. ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Watch: ఏందిరా ఇదీ..! చూడటానికి పసుపు ప్యాకెట్లే.. కట్ చేస్తే, లోపల యవ్వారమే వేరు.. వీడియో
Ganja
Shaik Madar Saheb
|

Updated on: Sep 09, 2024 | 4:26 PM

Share

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి ఎక్కడ పట్టుబడ్డా.. దాని మూలాలు ధూల్‌పేట్‌కు కనెక్ట్‌ అవుతుండడంతో అక్కడ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. గతంలో గుడుంబాకు అడ్డాగా ఉన్న ధూల్‌పేట్‌ను సమూలంగా ప్రక్షాళించిన పోలీసులు.. ఇప్పుడు.. గంజాయి నిర్మూలన కోసం.. ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ తనిఖీలతో స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు..  గంజాయి స్మగ్లింగ్‌, మూలాలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో స్మగ్లర్లు మరో అవతారం ఎత్తారు.. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. మరో పుసుపు ప్యాకెట్ల మాటున గంజాయ్ ను తరలించడం ప్రారంభించారు.. పుష్ప సినిమా మాదిరిగా స్మగ్లర్లు వేసిన స్కెచ్ లకు పోలీసులు దిమ్మతిరిగే చెక్ పెట్టారు.. ధూల్‌పేట్‌ లో పసుపు ప్యాకెట్ల మాటున సాగుతున్న గంజాయ్ గుట్టును రట్టు చేశారు..

పసుపు ప్యాకెట్లలో గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు.. దూల్పేట్ కి చెందిన నేహా భాయ్ అనే మహిళ పసుపు ప్యాకెట్లలో గంజాయి పెట్టి అమ్మకాలు చేస్తుండగా.. పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా 10 గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వీడియో చూడండి..

గత కొన్నిరోజులుగా.. తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, పోలీసులు గంజాయి మాటెత్తితే తాట తీసేలా వ్యవహారిస్తున్నారు. ప్రధానంగా.. హైదరాబాద్‌లో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి జాడ తెలిస్తేచాలు.. క్షణాల్లో వాలిపోతున్నారు. చిన్న క్లూ దొరికిందా.. ఇక.. అంతే సంగతులు.. వల పన్ని మరి నిందితుల గంజాయి గుట్టురట్టు చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ గంజాయి దొరికినా.. దాని మూలాలు దూల్‌పేట్‌కు కనెక్ట్‌ అవుతుండడంతో పోలీసులు ఆ దిశగా వేట మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే.. దూల్‌పేట్‌లో గంజాయి వ్యవహారం తీగ లాగితే.. డొంక బయటపడుతుండటంతో సీరియస్‌గా తనిఖీలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోజూ పల్లీలు తింటున్నారా? మంచిదే కానీ ఎంత వరకు? నిపుణుల హెచ్చరిక!
రోజూ పల్లీలు తింటున్నారా? మంచిదే కానీ ఎంత వరకు? నిపుణుల హెచ్చరిక!
క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు
క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Olympics 2028: ఒలింపిక్స్ 2028 నుంచి పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఔట్?
Olympics 2028: ఒలింపిక్స్ 2028 నుంచి పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఔట్?
ఈ టైమ్‌లో అరటిపండు తింటే అంతే సంగతులు.. పొరపాటున కూడా ఆ తప్పు..
ఈ టైమ్‌లో అరటిపండు తింటే అంతే సంగతులు.. పొరపాటున కూడా ఆ తప్పు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! వీరు మీ భాగస్వామి అయితే
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! వీరు మీ భాగస్వామి అయితే
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా?
వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా?
విశాఖలో ఏఐ హబ్‌పై సుందర్ పిచాయ్ కీలక ప్రకటన
విశాఖలో ఏఐ హబ్‌పై సుందర్ పిచాయ్ కీలక ప్రకటన