ఆఫీస్ కు రాలేం.. కావాలంటే ఉద్యోగం మానేస్తాం.. కంపెనీలకు తలనొప్పిగా మారిన ఉద్యోగుల ప్రవర్తన
కరోనా(corona) కారణంగా మానవజీవితం అతలాకుతలమైంది. జీవన విధానంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రెండేళ్ల నుంచి విడతల వారీగా విజృంభిస్తున్న కరోనా కారణంగా ఉద్యోగ ఉపాధి రంగాల్లో విశేష మార్పులు...
కరోనా(corona) కారణంగా మానవజీవితం అతలాకుతలమైంది. జీవన విధానంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రెండేళ్ల నుంచి విడతల వారీగా విజృంభిస్తున్న కరోనా కారణంగా ఉద్యోగ ఉపాధి రంగాల్లో విశేష మార్పులు తలెత్తాయి. పని ఆగిపోవద్దనే ఉద్దేశ్యంతో కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించాయి. అయితే ఇలా ఇంటిపనికి అలవాటు పడిన ఉద్యోగులు తిరిగి, ఆఫీసులకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్(Work Frome Home) సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు. కొన్ని నెలల నుంచి రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండటంతో కొన్ని కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని తొలగించాయి. ఆఫీసులకు రావాల్సిందేనని సూచిస్తున్నాయి. యాపిల్, గూగుల్ వంటి పలు సంస్థలు మునుపటిలా ఉద్యోగులు కార్యాలయాలకు(Office) రావాలని ఆహ్వానాలు పంపుతున్నాయి. అందుకు తగ్గట్టే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఉద్యోగులు మాత్రం సుముఖంగా లేరని పలు నివేదికలు తెలుపుతున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ బ్లైండ్.. 652 మంది యాపిల్ ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించింది.
సిబ్బందిని కార్యాలయాలకు తిరిగి తీసుకురావాలనే యాపిల్ సంస్థ విధానంపై 76 శాతమంది అసంతృప్తిగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. ప్రస్తుతం వారంతా వారంలో ఒకరోజు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మే 23 నుంచి వారంలో కనీసం మూడు రోజులు హాజరుకావాలని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉద్యోగులకు సూచించారు. ఈ విధానంపై ఉద్యోగులు విముఖత వ్యక్తం చేశారని ఆ సర్వే వెల్లడించింది. అంతే కాదు.. 56 శాతం మంది ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టాలని చూస్తున్నారని తెలిపింది. మరికొందరేమో రాకపోకల సమస్య గురించి ఆలోచిస్తున్నారని పేర్కొంది.
ఇదిలా ఉంటే మరో టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులను రప్పించేందుకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆఫర్ చేస్తోంది. వారిని ప్రోత్సహించేందుకు ‘రైడ్ స్కూట్’ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. రెండేళ్లుగా ఉద్యోగులు దాదాపుగా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇప్పుడు వారిని తిరిగి రప్పించడం సంస్థలకు ఇబ్బందిగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Viral Photo: ఈ ఫోటోలో సింహాన్ని కనిపెట్టండి చూద్దాం.. మొదటిగా చూసేదే మీ బలం.!