Telangana: ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లపై మంత్రి కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల సీనియారిటీ ప్రకారమే

|

Apr 22, 2022 | 7:41 AM

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తి చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indrareddy) అన్నారు. వెబ్ కాన్సెలింగ్ ద్వారా బదిలీలు(Transfers) చేపట్టి ప్రమోషన్లు కల్పించేలా...

Telangana: ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్లపై మంత్రి కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల సీనియారిటీ ప్రకారమే
Minister Sabita
Follow us on

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తి చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indrareddy) అన్నారు. వెబ్ కాన్సెలింగ్ ద్వారా బదిలీలు(Transfers) చేపట్టి ప్రమోషన్లు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల సీనియారిటీ ప్రకారం.. హెచ్‌ఎంల స్థాయి వరకు బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంఈవో, డిప్యూటీ ఈవో పదోన్నతులను(Promotions) మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి, ఎస్‌జీటీలకు ప్రమోషన్లు ఇస్తామని మంత్రి సబితా వివరించారు. ఫైల్ ను సాధారణ పరిపాలన శాఖకు పంపామని, మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం (2022-23) ప్రవేశాలు ముగిసిన తర్వాతే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపడతారు. మోడల్‌ స్కూల్ ఉపాధ్యాయులకు తొమ్మిదేళ్లుగా పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదని చర్చ సాగింది. ప్రస్తుత జోన్ల ప్రకారం ఆ ప్రక్రియలు పూర్తిచేయాలని నిర్ణయించారు. మూతపడిన బడులకు విద్యార్థులు వచ్చేలా చర్యలు చేపట్టి ఆయా పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. కేజీబీవీల్లో కాంట్రాక్టు సిబ్బంది బదిలీలు ఖాళీల మేరకు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని 1 నుంచి 8 తరగతుల్లోని విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 -24 విద్యాసంవత్సరంలో 9వ తరగతి, 2024 -25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్‌ మీడియం హోదాకు చిహ్నంగా మారిందని, ఈ మీడియంలో చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న భావన సమాజంలో నెలకొందని మంత్రి అన్నారు. కూలీనాలీ చేసుకుని కష్టపడుతున్న తల్లిదండ్రులు కడుపు కట్టుకుని తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియం చదువుల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తున్నారని.. అందరి కోరిక మేరకు ఇంగ్లీష్‌ మీడియాన్ని సర్కారు స్కూళ్లల్లో ప్రారంభిస్తున్నామన్నారు.

Also Read

Gold And Silver Price Today: మళ్ళీ పెరిగిన పసిడి ధర.. వరసగా మూడో రోజు దిగి వచ్చిన వెండి..నేడు ప్రధాన నగరాల్లో ధరలు

Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు డేంజర్ వార్నింగ్స్.. ఇంతకీ ఆ ప్రాజెక్టుకు ఏమైంది?

Yash-Prabhas: ముందుకు పడిన అడుగు.. ఓకే సినిమాలో హీరోలుగా యష్- ప్రభాస్‌