Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.72 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్! నలుగురు అరెస్ట్
EAGLE Team Busts Major Drug Manufacturing Racket In Hyderabad: గత కొంత కాలంగా డ్రగ్స్ తయారు చేస్తున్న కేంద్రాలపై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా జీడిమెట్ల లో రూ. 72కోట్ల విలువైన డ్రగ్స్ పోలీసులు గురువారం (అక్టోబర్ 9) పట్టుకున్నారు. 220కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకోగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు..

హైదరాబాద్, అక్టోబర్ 10: నగరంలో మత్తు మాఫియా రెచ్చిపోతుంది. తాజాగా వెలుగు చూసిన జీడిమెట్ల డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత కొంత కాలంగా డ్రగ్స్ తయారు చేస్తున్న కేంద్రాలపై ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా జీడిమెట్ల లో రూ. 72కోట్ల విలువైన డ్రగ్స్ పోలీసులు గురువారం (అక్టోబర్ 9) పట్టుకున్నారు. 220కిలోల ఎపిడ్రిన్ డ్రగ్ స్వాధీనం చేసుకోగా మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఒకరు పరారీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ను తయారు చేసి ముంబైకి తరలించేందుకు ప్రయత్నం చేశారు. పక్కా సమాచారంతో ఈగల్ టీం దాడి చేసి, నిందితులను పట్టుకున్నారు. నిందితులు… శివరామకృష్ణ, అనిల్, దొర బాబు, వెంకటకృష్ణారావు, ప్రసాద్‌గా గుర్తించారు. గతంలో రెండు సార్లు… బెంగుళూరు, హైదరాబాద్ ఎన్సీబీకు శివరామకృష్ణ పట్టుబడ్డాడు.
అన్నదమ్ములు వెంకట కృష్ణారావు, ప్రసాద్ IDA బొల్లారంలో ఉన్న PNM లైఫ్ సైన్సెస్ కంపెనీకి ఓనర్స్ గా ఉన్నారు. స్వామి అనే ఫ్రెండ్ సహాయంతో పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కు శివరామకృష్ణ వెళ్లాడు. కంపెనీలో కాకినాడకు చెందిన అనిల్ తో శివరామకృష్ణకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నిందితులు అనిల్, శివరామకృష్ణ ఇద్దరూ కలిసి మెఫీడ్రిన్ డ్రగ్స్ దందాకు తెరలేపారు. PNM కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్న అనిల్.. శివరామకృష్ణ ఇచ్చిన ఫార్ములా తో 220 కిలోల డ్రగ్స్ తయారీ చేశాడు. డ్రగ్స్ తయారు చేసినందుకు గాను రూ.8 లక్షలు శివరామకృష్ణకు ఇచ్చాడు.
డ్రగ్స్ తయారీకి కంపెనీలోని రియాక్టర్స్ ను అనిల్ కు వెంకటకృష్ణ రావు, ప్రసాద్ ఇచ్చారు. డ్రగ్స్ తయారీ తర్వాత జీడిమెట్ల లోని శివరామకృష్ణ నివాసానికి తరలించేవారు. ఇందుకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో భారీ డ్రగ్స్ కేసును ఈగల్ అధికారులు చేదించారు. నగరంతో సహా ముంబై, గోవా ప్రాంతాలకు డ్రగ్స్ తరలించాలని భావించిన నిందితుల ప్లాన్ బూడిదైంది. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బృందాలు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




