Hyderabad: హైదరాబాదీలకు పోలీసులు అలర్ట్‌.. అటువైపు రావొద్దంటూ సూచన..

| Edited By: Narender Vaitla

Jan 06, 2024 | 9:53 AM

సాయంత్రం ప్రారంభం అయ్యే నుమాయిష్ ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ రావడానికి ఆ సమయంలో ట్రాఫిక్‌ విపరీతంగా ఏర్పడుతోంది. ఇక మరీ ముఖ్యంగా శని, ఆదివారాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో నుమాయిష్ జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది...

Hyderabad: హైదరాబాదీలకు పోలీసులు అలర్ట్‌.. అటువైపు రావొద్దంటూ సూచన..
Hyderabad
Follow us on

నుమాయిష్‌ ప్రదర్శన.. కేవలం హైదరాబాద్‌ నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు విజిట్ చేస్తారు. వీకెండ్స్ లో అయితే చెప్పనవసరం లేదు లక్షలాదిమంది పబ్లిక్ నుమాయిష్ ను చూసేందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వస్తువులతో పాటు షాపింగ్, చిన్నపిల్లల ఆడుకునేందుకు గేమ్స్ వివిధ ఇదే రకాల పిండి పదార్థాలు ఉంటాయి మినీ ఇండియాగా చెప్తూ ఉంటారు.

సాయంత్రం ప్రారంభం అయ్యే నుమాయిష్ ను సందర్శించేందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ రావడానికి ఆ సమయంలో ట్రాఫిక్‌ విపరీతంగా ఏర్పడుతోంది. ఇక మరీ ముఖ్యంగా శని, ఆదివారాల్లో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో నుమాయిష్ జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాల మీదుగా వెళ్లే వారిని పోలీసులు అలర్ట్‌ చేశారు. వారాంతాల్లో వీలైనంత వరకు ఆ మార్గాన్ని అవైడ్‌ చేయాలని సూచించారు.

ఇక ఇదిలా ఉంటే సిద్దంబర్‌ బజార్‌ వైపు నుంచి నాంపల్లి వైపునకు వెళ్లే జిల్లాలకు చెందిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ బస్సులు, ఇతర భారీ వాహనాలను మొహింజామార్కెట్‌ వద్ద అబిడ్స్‌ వైపు మళ్లిస్తున్నారు. అదేవిధంగా బషీర్‌బాగ్‌, కంట్రోల్‌ రూం వైపు నుంచి నాంపల్లికి వచ్చే వాహనాలను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద బీజేఆర్‌ విగ్రహం, అబిడ్స్‌ వైపు డైవర్ట్ చేశారు. బేగంబజార్‌, ఛత్రి నుంచి మలాకుంట వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్‌ వద్ద దారుసలాం, ఏక్‌మినార్‌ వైపు మళ్లిస్తున్నారు.

అలాగే దారుసలాం నుంచి అఫ్జల్‌గంజ్‌ వైపు వెళ్లే వాహనాలను అలస్క జంక్షన్‌ నుంచి బేగంబజార్‌, సిటీ కాలేజ్‌ వైపు రూట్ కు మరలించారు. మూసాబౌలి, బహుదూర్‌పురా వైపు నుంచి నాంపల్లికి వెళ్లే వాహనాలను సిటీ కాలేజీ , నయాపూల్‌, ఎంజేమార్కెట్‌ రూట్‌లో పోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 14 వ తేదీ వరుకు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ఇతర మార్గాలను చూసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..