Ganesh Nimarjan: హైదరాబాద్‌లో ఈ రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌.. పూర్తి వివరాలు..

|

Sep 18, 2021 | 7:17 PM

Ganesh Nimarjan: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి చెదురుమొదురు సంఘటనలు జరగకూడదనే...

Ganesh Nimarjan: హైదరాబాద్‌లో ఈ రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌.. పూర్తి వివరాలు..
Follow us on

Ganesh Nimarjan: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎలాంటి చెదురుమొదురు సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ఎక్సైజ్‌ పోలీసులు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని వైన్స్‌, బార్లు, పబ్‌లు సెప్టెంబర్‌ 19, 20వ తేదీల్లో మూసి ఉంటాయని ఎక్సైజ్‌ పోలీసులు తెలిపారు. 19వ తేదీన ఉద‌యం 9 గంట‌ల నుంచి 20న సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు, బార్లు, ప‌బ్‌లను మూసి వేయనున్నట్లు ప్రకటన జారీ చేశారు.

ఇదిలా ఉంటే గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో భక్తులు శోభ యాత్రను వీక్షించేందుకు వీలుగు ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ పరిధిలో 565 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని దాదాపు 31 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు, ప్రతి డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గణేశ్‌ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న అర్ధరాత్రి తర్వాత కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నారు.

అంతేకాకుండా రైల్వే శాఖ కూడా ప్రత్యేకంగా ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనుంది. ఇక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్థరాత్రి నుంచే నగరంలోని అంతర్రాష్ట్ర, జిల్లాల లారీల ప్రవేశంపై నిషేధాజ్ఞలు పెట్టారు. ఆర్టీసీ బస్సులను సైతం పలు చోట్ల దారి మళ్లించే ఏర్పాట్లు చేశారు.

Also Read: Samantha: తిరుమలలో ఆ ప్రశ్శ అడిగినందుకు అసహనం వ్యక్తంచేసిన సమంత.. బుద్ధి ఉందా అంటూ..

కాల్చిన వెల్లుల్లిలో అద్భుత ఔషధ గుణాలు..! పాలతో కలిపి తీసుకుంటే ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం..

Aadhaar: ఆధార్ వినియోగదారులకు గమనిక.. డేట్‌ ఆఫ్ బర్త్‌, జెండర్‌ మార్చుకోవడానికి ఒకే అవకాశం..!