Drunk and Drive in Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు హైదరాబాబ్ ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ మందుబాబులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 45 పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మందుబాబుల కిక్కును దించారు ట్రాఫిక్ పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడుతుపూ చాలా మంది మందుబాబులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే 5 కార్లు, 7 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారికి భారీగా జరిమానా విధించిన పోలీసులు.. మద్యం తాగి పట్టుబడ్డ వాళ్లందరికీ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
Also read: