AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hima Deepthi: సంతాన సాఫల్యానికి సహజ దీప్తి.. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హిమ దీప్తి!

నేటి రోజుల్లో వైద్యాన్ని ఒక వృత్తిగా కాకుండా వ్యాపారంగా చూసే ధోరణి పెరిగిపోతుంది. అలాంటి సమయంలో నిజమైన సేవా భావంతో, నమ్మకంతో రోగులను ఆదుకుంటున్న వైద్యులను కనుగొనడం చాలా అరుదు. అలాంటి అరుదైన వైద్యులలో ఒకరు డాక్టర్ హిమ దీప్తి, సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలకు ఆమె ఒక వెలుగుదారి.

Hima Deepthi: సంతాన సాఫల్యానికి సహజ దీప్తి.. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హిమ దీప్తి!
Fertility Specialist
Anand T
|

Updated on: Sep 10, 2025 | 2:59 PM

Share

డాక్టర్ హిమ దీప్తి తన ఎంబీబీఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో పూర్తిచేశారు. తరువాత కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఎంఎస్ (ప్రసూతి అండ్‌ గైనకాలజీ) చేసి తన నైపుణ్యాన్ని మరింత పదిలం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా, అమెరికాలో అడ్వాన్స్‌డ్ ఫర్టిలిటీ ట్రైనింగ్ (IVF, రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజీ)లో శిక్షణ పొందారు. అదనంగా, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ లాపరోస్కోపిక్ సర్జన్స్ (WALS) నుండి ఫెలోషిప్ ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ కూడా పూర్తి చేశారు. 17 ఏళ్ల అనుభవం గల ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌గా, డాక్టర్ హిమ దీప్తి అనేక జంటల జీవితం మార్చారు. PCOS, ఎండోమెట్రియోసిస్, పురుషులు–మహిళల్లో నిరంతర సంతాన సమస్యలు, IVF వైఫల్యాలు వంటి కేసుల్లో ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది.

ప్రతి రోగి ఒక కుటుంబసభ్యురాలే

ఆమెకు పేషెంట్ అంటే కేవలం ఒక కేసు కాదు, ఒక కుటుంబం, భవిష్యత్తు” అని నమ్మే డా. హిమ దీప్తి. ఆమె ప్రతి రోగిని వ్యక్తిగత శ్రద్ధతో పలకరిస్తారు. చిన్న సమస్య అయినా సీరియస్‌గా తీసుకొని పరిష్కారం చూపడం, రోగుల మనసులో నమ్మకాన్ని నింపడం ఆమె వైద్యరంగపు ప్రత్యేకత. ఆమె దగ్గర వైద్యం తీసుకున్న ఒక మహిళ మాట్లాడుతూ.. మేము ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయాం. కానీ డాక్టర్ సహనంతో ఇచ్చిన సలహాలతో నేను గర్భవతి అయ్యాను. అది మా జీవితాన్నే మార్చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.

గర్భధారణలో సమగ్ర సేవలు

తల్లిదండ్రుల కావాలన్న కల నెరవేరిన తర్వాత కూడా బాధ్యత అక్కడితో ముగియదు. గర్భధారణలో తల్లి, శిశువు ఆరోగ్యాన్ని కాపాడటం కూడా చాలా ముఖ్యం. ఈ దశలోనూ డా. హిమా దీప్తి తన సమగ్ర సేవలతో జంటలకు అండగా ఉంటారు. రెగ్యులర్ చెకప్‌ల నుండి పోషకాహార సూచనలు, ఆరోగ్యపరమైన సలహాలు వరకు ప్రతి అడుగులో మార్గదర్శకత్వం అందిస్తారు.

సభ్యత్వం ద్వారా సేవా విస్తరణ

డాక్టర్ హిమ దీప్తి అనేక జాతీయ, అంతర్జాతీయ సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండటం వలన వైద్యరంగంలో కొత్త పరిశోధనలు, ఆధునిక పద్ధతులు త్వరగా అందుబాటులోకి తెస్తున్నారు. సభ్యత్వం ద్వారా తాజా అల్ట్రాసౌండ్ స్కానింగ్, హై-రిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్‌మెంట్, లాపరోస్కోపిక్ సర్జరీలు మరియు అదనపు సేవలు అందిస్తూ, తల్లిదండ్రులు కావాలనుకునే వారికి మరింత చేరువ అవుతున్నారు. ఈ అనుబంధాలు ఆమెను సమాజానికి ఇంకా దగ్గర చేస్తూ, వైద్యరంగానికి కొత్త దిశలను చూపిస్తున్నాయి.

ఆమె కృషికి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి

  • FOGSI – DHEERA అవార్డు
  • అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు
  • మయూరి ఆర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డు
  • ద్రోణాచార్య అవార్డు (ISAR కాన్ఫరెన్స్)
  • ఈ అవార్డులు ఆమె వైద్య నైపుణ్యానికే కాకుండా, మహిళల ఆరోగ్యంపై చేసిన సేవలకు గుర్తుగా దక్కినవి

మహిళల ఆరోగ్యం, సంతాన సాఫల్యం లాంటి అత్యంత నాజూకు రంగాల్లో డాక్టర్ హిమ దీప్తి అందిస్తున్న సేవలు అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా మారాయి. వైద్య నైపుణ్యం, నిజాయితీ, ఆప్యాయత ఈ మూడు లక్షణాలు కలిసినప్పుడు ఒక వైద్యులు “మార్గదర్శకులు”గా నిలుస్తారు. అలాంటి మార్గదర్శకురాలే డాక్టర్ హిమ దీప్తి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.