Drunk Driving: వాహనాలు సీజ్ చెయ్యొద్దు.. ట్రాఫిక్ సిబ్బందికి సైబరాబాద్ సీపీ ఆదేశాలు..

మద్యం సేవించి వాహనాలు నడిపితే పోలీసులు పెట్టుకుంటారని.. పట్టుకుంటే వాహనాలను సీజ్ చేస్తారన్న భయం ఉండేది ప్రజలకు.

Drunk Driving: వాహనాలు సీజ్ చెయ్యొద్దు.. ట్రాఫిక్ సిబ్బందికి సైబరాబాద్ సీపీ ఆదేశాలు..
Cp

Updated on: Nov 07, 2021 | 11:03 PM

Drunk Driving: మద్యం సేవించి వాహనాలు నడిపితే పోలీసులు పెట్టుకుంటారని.. పట్టుకుంటే వాహనాలను సీజ్ చేస్తారన్న భయం ఉండేది ప్రజలకు. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మందుబాబులు ఉపిరిపీల్చుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయకూడదని పోలీసులకు తేల్చి చెప్పింది హైకోర్ట్. అయితే హైకోర్టు ఆదేశాలను పోలీసులు ఖచ్చితంగా పాటించాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేయొద్దన్నారు.

ఈ మేరకు కమిషనరేట్ లో ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ఉన్నతాధికారులు, సిబ్బందితో స్టీఫెన్ రవీంద్ర సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని, ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేయాలనీ సీపీ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహనా సమావేశాలు నిర్వహించాలన్నారు స్టీఫెన్ రవీంద్ర.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Andhra Pradesh: సగం ధరకే కొత్త బ్రాండెడ్ సెల్‌ఫోన్లు.. ఎగబడ్డ జనం.. ఆరా తీస్తే షాక్

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్.. నెల రోజులుగా యువతిపై సామూహిక అత్యాచారం!

AP Crime News: ప్రకాశం జిల్లాలో విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి.. మగ్గురు అయ్యప్ప భక్తుల మృతి..