Dharmapuri Aravind: రంజీ క్రికెటర్ టూ రాజకీయ నాయకుడు.. ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రస్థానం ఇది

|

Dec 02, 2023 | 10:58 AM

Dharmapuri Aravind Telangana Election 2023: బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ పలు సందర్భాల్లో కాంట్రవర్సీ వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తెలంగాణ రాజకీయాల్లో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉండే అర్వింద్ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున..

Dharmapuri Aravind: రంజీ క్రికెటర్ టూ రాజకీయ నాయకుడు.. ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రస్థానం ఇది
Dharmapuri Arvind
Follow us on

Dharmapuri Aravind Telangana Election 2023: బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ పలు సందర్భాల్లో దూకుడైన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. తెలంగాణ రాజకీయాల్లో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉండే అర్వింద్ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అర్వింద్ సమీప అభ్యర్ధి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై గెలుపొందారు. అప్పట్లో ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

1995/96లో హైదరాబాద్‌లో పలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లలో ఆడారు ధర్మపురి అర్వింద్. ఈయన నిజామాబాద్ నుంచి మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా ఎన్నికైన డి. శ్రీనివాస్ చిన్న కుమారుడు. ఇదిలా ఉండగా.. ధర్మపురి అర్వింద్ రాజకీయ జీవితంలో పలు వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.

2019 ఎన్నికల అఫిడివిట్‌లో ధర్మపురి అర్వింద్ పీజీ చదవుకున్నా.. చదివినట్టు చూపించారని అప్పట్లో టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) నేతలు ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు సైతం పక్కాగా సేకరించారు. డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ ద్వారా రాజ‌స్థాన్‌లోని విద్యాపీఠ్ యూనివ‌ర్సిటీ ద్వారా దూర విద్య నుంచి ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్ చ‌దివిన‌ట్లు అర్వింద్ త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పొందుప‌రిచారు. రాజ‌స్థాన్‌లోని స‌ద‌రు యూనివ‌ర్సిటీలో ధ‌ర్మిపురి అరవింద్ చ‌దివారా, లేదా అనేది ఆర్టీఐ ద్వారా బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్) నేతలు అడగ్గా.. ఆ పేరుతో త‌మ యూనివ‌ర్సిటీలో ఎవ‌రూ చ‌ద‌వ‌లేద‌నే స‌మాధానం వ‌చ్చింద‌ని టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఈ విషయమూ అప్పట్లో హాట్ డిబేట్ అయింది.

కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు ధర్మపురి అర్వింద్. నవంబర్ 8న కోరుట్లలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ధర్మపురి అర్వింద్.. తన అఫిడివేట్‌లో రూ. 107.43 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. అలాగే తనపై 17 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం హోరాహోరీ పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌కు ప్రత్యర్ధుల నుంచి టఫ్ ఫైట్ తప్పదని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..