Dakshin Healthcare Summit 2024: ఆగస్టు 3న హైదరాబాద్‌లో ‘దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024’ ప్రారంభం.. టీవీ9 నెట్‌ వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం

|

Jul 26, 2024 | 8:15 PM

మన దేశంలో హెల్త్‌ కేర్‌ సెక్టార్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సంచలనాత్మక ఆవిష్కరణలు సవాళ్లతో పాటు అసంఖ్యాక అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది. డిజిటల్ ట్రాన్ఫర్‌మేషన్‌, హెల్త్‌ కేర్‌ సెక్టార్‌ సంభావ్యత- ఇతర సమస్యలపై చర్చించేందుకు TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో 'దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024' నిర్వహిస్తోంది. ఆగస్టు 3న హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌లో టాప్‌ మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌, విధాన పాలసీ మేకర్స్‌, ఆవిష్కర్తలు, పరిశ్రమల ప్రముఖులు ఒకే వేదికపై..

Dakshin Healthcare Summit 2024: ఆగస్టు 3న హైదరాబాద్‌లో దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024 ప్రారంభం.. టీవీ9 నెట్‌ వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం
Dakshin Healthcare Summit 2024
Follow us on

మన దేశంలో హెల్త్‌ కేర్‌ సెక్టార్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సంచలనాత్మక ఆవిష్కరణలు సవాళ్లతో పాటు అసంఖ్యాక అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది. డిజిటల్ ట్రాన్ఫర్‌మేషన్‌, హెల్త్‌ కేర్‌ సెక్టార్‌ సంభావ్యత- ఇతర సమస్యలపై చర్చించేందుకు TV9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ‘దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024’ నిర్వహిస్తోంది. ఆగస్టు 3న హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌లో టాప్‌ మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌, విధాన పాలసీ మేకర్స్‌, ఆవిష్కర్తలు, పరిశ్రమల ప్రముఖులు ఒకే వేదికపై కొలువుదీరనున్నారు. హెల్త్‌కేర్ టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న పురోగతిని, వేగంగా మార్పు చెందుతున్న వైద్య విధానాలను ఈ సమ్మిట్‌లో ప్రదర్శించనున్నారు. ఏఐ, రిమోట్ కేర్, రోబోటిక్స్‌తో సహా వైద్య సాంకేతికతలో చోటు చేసుకుంటున్న ఆవిష్కరణలపై దృష్టి సారించనున్నారు. డిజిటల్ హెల్త్ అండ్‌ డేటా అనలిటిక్స్, జీవక్రియ ఆరోగ్యం, ఊబకాయం, జీవనశైలి వ్యాధులు, పబ్లిక్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వంటి పలు అంశాలపై ఈ సమ్మిట్‌లో చర్చిస్తారు.

దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024ను అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్‌ను నిర్వహించడం ద్వారా భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో అతిపెద్ద వాటాదారులుగా ఉంటారు. ఈ సమ్మిట్‌కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండ్ రీజెనరేటివ్ మెడిసిన్ (మెదాంత) చైర్మన్ డాక్టర్ అరవిందర్ సింగ్ సోయిన్, మేనేజింగ్ పార్టనర్ అండ్‌ యాక్సెల్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రశాంత్ ప్రకాష్, ఫోర్టిస్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్స్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ వృత్తి లుంబా, న్యూరాలజీ అండ్ స్లీప్ సెంటర్ (న్యూఢిల్లీ) డైరెక్టర్ అండ్‌ ఫౌండర్ డాక్టర్ మన్వీర్ భాటియా, క్లినికల్ ప్రాసెస్ లీడ్ ఫిజీషియన్ (లండన్) డాక్టర్ ఉమ్మర్ ఖదీర్, IISc డెవలప్‌మెంటల్ బయాలజీ అండ్ జెనెటిక్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ సైనీ, SOHFIT వ్యవస్థాపకుడు డాక్టర్‌ సోహ్రాబ్‌ కుస్రూషాహి, ఎంపీ డాక్టర్ సిఎన్ మంజునాథ్, ఎఐజి హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, గ్లోబల్ హెల్త్ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్, స్ట్రాండ్ లైఫ్ సైన్స్ ఫౌండర్‌ డాక్టర్ విజయ్ చంద్రు, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజీ కంట్రీ డైరెక్టర్ డాక్టర్ విశాల్ రావు, అకృతి ఆప్తాల్మిక్ CEO & ఛైర్మన్ డాక్టర్ కుల్దీప్ రైజాడా, AINU ఇండియా కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్ అండ్‌ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ ఎండి గౌస్ తదితరులు ఈ సమ్మిట్‌లో పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి

దక్షిణ్ హెల్త్‌కేర్ సమ్మిట్ 2024 భారతదేశ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ వృద్ధిని ఉత్ప్రేరకపరిచే ప్రభావవంతమైన సందేశాలను అందిస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఈ రంగంపై ప్రభావం చూపే ట్రెండ్‌ల గురించి ఈ సమ్మిట్‌లో తెలుసుకోవచ్చు. ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం టీవీ9 నెట్‌ వర్క్‌లో వీక్షించవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.