పాక్ కెప్టెన్‌ ఫొటోతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్నంగా ప్రకటనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ ఫొటోను వాడుకున్నారు. ఇటీవల ప్రపంచ వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ గట్టిగా ఆవలిస్తున్న ఫొటో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫొటోపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు అదే ఫొటోను సైబరాబాద్ పోలీసులు వాడుకున్నారు. సర్ఫరాజ్ ఆవలిస్తోన్న ఫొటోను […]

పాక్ కెప్టెన్‌ ఫొటోతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 22, 2019 | 11:02 AM

వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్నంగా ప్రకటనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ సర్ఫరాజ్ ఫొటోను వాడుకున్నారు. ఇటీవల ప్రపంచ వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ గట్టిగా ఆవలిస్తున్న ఫొటో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫొటోపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు అదే ఫొటోను సైబరాబాద్ పోలీసులు వాడుకున్నారు.

సర్ఫరాజ్ ఆవలిస్తోన్న ఫొటోను షేర్ చేసిన పోలీసులు.. ‘‘నిద్ర వస్తున్నా.. ఆపుకొని మరీ బలవంతంగా డ్రైవింగ్ చేయకండి. అది చాలా డేంజర్’’ అని కామెంట్ పెట్టారు. అయితే ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుటుంటోంది. సైబరాబాద్ పోలీసులకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువే అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.