AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వారం రోజుల్లో పోలీస్ స్టేషన్‌కు 29 మంది భార్య భర్తలు..

సైబరాబాద్ పోలీసులు మహిళలు, పిల్లలు, కుటుంబాల రక్షణ కోసం వారం రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. AHTU–SHE టీమ్స్ సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో మానవ అక్రమ రవాణా, వ్యభిచారం, ఈవ్‌టీజింగ్‌, సోషల్ మీడియా హరాస్మెంట్‌పై దాడులు, చెక్‌లు చేపట్టారు. .. ..

Hyderabad: వారం రోజుల్లో పోలీస్ స్టేషన్‌కు 29 మంది భార్య భర్తలు..
Cyberabad Police
Vijay Saatha
| Edited By: |

Updated on: Nov 29, 2025 | 9:04 PM

Share

మానవ అక్రమ రవాణా, వ్యభిచార గృహాలు, మహిళలపై వేధింపులు, కుటుంబ కలహాలు, పిల్లల భద్రత వంటి అంశాలపై సైబారాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వారం రోజులపాటు (22.11.2025 నుంచి 28.11.2025 వరకు) నిర్వహించిన ఈ డ్రైవ్‌‌ను AHTU (యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్),  SHE టీమ్స్ సంయుక్తంగా చేపటాయి. మానవ అక్రమ రవాణా అరికట్టే చర్యల్లో భాగంగా AHTU చేపట్టిన దాడుల్లో 38 మంది మహిళా సెక్స్ వర్కర్లు, ఒక ట్రాన్స్‌జెండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 11 మంది బాధితులను రక్షించగా, 4 పీటా కేసుల్లో 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక పీటా కేసులో, నిందితుడికి కూకట్‌పల్లి MM జిల్లా కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తూ, రూ.300 జరిమానా కూడా విధించినట్లు అధికారులు వెల్లడించారు.

మహిళల భద్రతకు అంకితమైన SHE టీమ్స్ వారం రోజులపాటు 167 డికాయ్ ఆపరేషన్లు నిర్వహించాయి. వీటిలో పబ్లిక్ ప్రదేశాల్లో అసభ్యకృత్యాలకు పాల్పడుతున్న 67 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో 86 కేసుల్లో పిట్టీ కేసులు నమోదు చేయగా, మిగతా వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అదనంగా, మహిళా బాధితుల నుండి వివిధ మార్గాల ద్వారా వచ్చిన 22 ఫిర్యాదులను SHE టీమ్స్ స్వీకరించి చర్యలు ప్రారంభించాయి. కుటుంబ సమస్యల పరిష్కారంలో భాగంగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లలో భార్యభర్తల మధ్య ఉన్న 29 కుటుంబ వివాదాలను పరిష్కరించి తిరిగి ఏకం చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు.

ప్రజల్లో అవగాహన పెంచే దిశగా AHTU , SHE టీమ్స్ సైబరాబాద్ పరిధిలో ఉన్న విద్యాసంస్థలు, కాలనీలు, ఉద్యోగ స్థలాలు, పబ్లిక్ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మొత్తం 339 మందికి మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, ఈవ్‌టీజింగ్‌, సోషల్ మీడియా హరాస్మెంట్‌, చిన్నారుల వివాహాలు, చైల్డ్ రైట్స్‌, చైల్డ్ లేబర్‌, స్టాకింగ్‌, భిక్షాటన, సైబర్ బుల్లీయింగ్‌, సైబర్ మోసాలు వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించారు. మహిళా హెల్ప్‌లైన్ 181, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, డయల్ 100 అత్యవసర సేవల ప్రాముఖ్యత, సైబర్ క్రైమ్ సహాయ నెంబర్ 1930 వంటి కీలక సేవల గురించి కూడా ప్రజలకు సూచనలు ఇచ్చారు. మహిళలు, పిల్లలు, కుటుంబాలు, సున్నిత వర్గాల రక్షణ కోసం ప్రత్యేక డ్రైవ్‌లు క్రమం తప్పకుండా కొనసాగుతాయని, నేరాలపై శూన్య సహన విధానంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.