Cyberabad Police Tweet: మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..

Cyberabad Police Tweet: మనం వాహనాలను అమ్మేసినా.. కొన్నిసార్లు కొన్నవారు RC ట్రాన్స్‌ఫర్ చేసుకోరు. దాని వల్ల అమ్మినవాళ్లు చలానాలు...

Cyberabad Police Tweet: మీ వెహికిల్‌ను అమ్మేసినా.. RC ట్రాన్స్‌ఫర్ కాలేదా.? అయితే ఇలా చేయండి..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 03, 2021 | 1:26 PM

Cyberabad Police Tweet: మనం వాహనాలను అమ్మేసినా.. కొన్నిసార్లు కొన్నవారు RC ట్రాన్స్‌ఫర్ చేసుకోరు. దాని వల్ల అమ్మినవాళ్లు చలానాలు, లీగల్ సమస్యల వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యను చాలామంది ఫేస్ చేసి ఉంటారు. అయితే వెహికిల్ అమ్మేటప్పుడు ఓనర్ షిప్ బదిలీ అయ్యేలా చూసుకోవాలని తెలంగాణ పోలీసులు అంటున్నారు. ఆ బాధ్యత అమ్మేవారిదే అని పేర్కొన్నారు. ఒకవేళ బదిలీ కాకపోతే E-Challan Portalలో సదరు వెహికిల్ వివరాలు అందించాలని సూచిస్తున్నారు. (Cyberabad Police Tweet)

తాజాగా ఓ నెటిజన్ ఈ అంశంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్విట్టర్ వేదికగా సలహా కోరగా.. ”మీ బైక్ అమ్మేటప్పుడు సరైన విధంగా Ownership Transfer అయ్యే విధంగా చూసుకోవడం మీ బాధ్యతే. E-Challan Portal: https://echallan.tspolice.gov.in/publicview/కి వెళ్లి Complaints పైన క్లిక్ చేసి Sold Out Vehicle ని సెలెక్ట్ చేసుకుని మీ వివరాలు అందించండి. మేము తగిన చర్య తీసుకుంటాం” అని ట్రాఫిక్ పోలీసులు రిప్లై ఇచ్చారు. (Cyberabad Police Tweet)

కాగా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తూ వస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Also Read:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండో రోజు ఎంతంటే.!

ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..

రోజుకో ట్విస్ట్ ఇస్తున్న మదనపల్లె మర్డర్ కేసు.. హత్యల తర్వాత కూడా వారి సోషల్ మీడియా ఖాతాలు యాక్టివ్‌లోనే.?