Double-Decker Buses: ఓ నెటిజన్ కోరిక కార్యరూపం.. త్వరలో భాగ్యనగరంలో రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు..
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. ఇప్పుడు ఎందుకు కనిపించటం లేదని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు చేసిన ట్వీట్ నేడు కార్యరూపంలోకి వస్తుంది. త్వరలో ఆ నెటిజన్ కోరికమాత్రమే కాదు..
ఒకప్పుడు భాగ్యనగరం అంటే.. చార్మినార్. గోల్కొండ, ట్యాంక్ బండ్ లతో పాటు వెంటనే గుర్తుకొచ్చేవి డబుల్ డెక్కర్ బస్సులు. ప్రస్తుత తరంలో ఈ బస్సులను అప్పుడప్పుడు సినిమాల్లో చూడడం తప్పించి హైదరాబాద్ రోడ్లమీద చూసింది లేదు.. ఎప్పుడో కొన్ని ఏళ్ళక్రితమే ఈ బస్సులు నిలిచిపోయాయి. అయితే ఇవి త్వరలో మళ్ళీ హైదరాబాద్ వాసులకు కనువిందు చేయడానికి రానున్నాయట.. రానున్న రోజుల్లో మళ్ళీ రోజుల్లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. వీటిని పునరుద్ధరించడంపై తెలంగాణ ఆర్టీసీ దృష్టి సారించింది.
ఇంటర్ సిటీ సర్వీసుల కోసం 25 బస్సుల కొనుగోలుకు తెలంగాణ ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. గురువారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు టెండరు పత్రాలను కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు అనుమానాల నివృత్తికి కు cme@tsrtc.telangana.gov.in మెయిల్ చేయొచ్చు. చీఫ్ మెకానికల్ ఇంజినీర్, తెలంగాణ ఆర్టీసీకి స్పీడ్ పోస్టు ద్వారా కూడా రాయవచ్చునని ఆర్టీసీ పేర్కొంది. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఆసక్తి గల గుత్తేదారులతో ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 25 మధ్యాహ్నం 2 గంటల వరకు గడువు విధించారు.
గతంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. ఇప్పుడు ఎందుకు కనిపించటం లేదని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు చేసిన ట్వీట్ నేడు కార్యరూపంలోకి వస్తుంది. త్వరలో ఆ నెటిజన్ కోరికమాత్రమే కాదు హైదరాబాద్ వాసుల డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణం కలను కూడా తీర్చనుంది.
Also Read: