Traffic Police: బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌.. అంత‌టితో ఆగ‌కుండా సెల్ఫీ ఫొటో.. మ‌నుషులే పోయేంత క‌ళా పోష‌ణ అవ‌స‌రమా.

|

Jun 18, 2021 | 6:09 AM

Traffic Police: రోడ్డు ప్ర‌మాదాలు ఎన్ని జ‌రుగుతోన్నా కొంద‌రు మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూనే ఉంటారు. కొన్ని రోడ్డు ప్రమాదాలు ఎదుటి వారి త‌ప్పిదం వ‌ల్ల జ‌రిగితే.. మ‌రికొన్ని ప్ర‌మాదాలు మాత్రం మ‌న నిర్ల‌క్ష్యం వ‌ల్లే జ‌రుగుతుంటాయి. ట్రాఫిక్ రూల్స్‌ను...

Traffic Police: బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌.. అంత‌టితో ఆగ‌కుండా సెల్ఫీ ఫొటో.. మ‌నుషులే పోయేంత క‌ళా పోష‌ణ అవ‌స‌రమా.
Traffic Rules Violation
Follow us on

Traffic Police: రోడ్డు ప్ర‌మాదాలు ఎన్ని జ‌రుగుతోన్నా కొంద‌రు మాత్రం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూనే ఉంటారు. కొన్ని రోడ్డు ప్రమాదాలు ఎదుటి వారి త‌ప్పిదం వ‌ల్ల జ‌రిగితే.. మ‌రికొన్ని ప్ర‌మాదాలు మాత్రం మ‌న నిర్ల‌క్ష్యం వ‌ల్లే జ‌రుగుతుంటాయి. ట్రాఫిక్ రూల్స్‌ను పాటించకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాహ‌నాలు న‌డుపుతూ ప్ర‌మాదాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలా ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను గాలికి వ‌దిలేసిన యువ‌తుల ఫొటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు సైబ‌రాబాద్ పోలీసులు.
ఓ స్కూటీపై ఓ యువ‌కుడు ఇద్ద‌రు అమ్మాయిలు వెళుతున్నారు. బైక్‌పై ముగ్గురు ప్రయాణించ‌డ‌మే తప్పు. వీరు ఆ త‌ప్పుతోనే ఆగ‌కుండా ఏకంగా బైక్ ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలోనే మొబైల్ ఫోన్‌తో సెల్ఫీ ఫొటో తీసున్నారు. దీంతో ఇది అక్క‌డే ఉన్న ఓ ట్రాఫిక్ పోలీస్ కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫొటోకు కాస్త సినిమాటిక్ ట‌చ్ యాడ్ చేసిన పోలీసులు ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డంతో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోతో పాటు పోలీసులు.. `మ‌నిష‌న్నాక‌ కాసింత కలాపోసనుండాలయ్యా కానీ మనుషులే పోయెంత ఉండకూడదు. బండి నడిపేటప్పుడు చిన్న అజాగ్రత్తకైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది` అనే క్యాప్ష‌న్‌ను జోడించారు. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజ‌న్లు వారి నిర్ల‌క్ష్యాన్ని త‌ప్పుప‌డుతున్నారు.

సైబ‌రాబాద్ పోలీసులు పోస్ట్ చేసిన ట్వీట్..

Also Read: KTR : తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్స్ ఇత‌ర రాష్ట్రాల‌కు దిక్సూచిగా నిలుస్తాయి : మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్

లాక్ డౌన్ అమల్లో ఉన్నా భారీగా పసిడి స్మగ్లింగ్…..మణిపూర్ లో రూ. 21 కోట్ల విలువైన బంగారు బిస్కెట్ల స్వాధీనం

Aadhar Card: ఆధార్ నెంబ‌ర్‌ను మ‌రిచిపోయారా..? ఇంట‌ర్‌నెట్‌, ఫోన్ నెంబ‌ర్ ఉంటే చాలు.. ( వీడియో )