Telangana: దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఫెయిల్.. కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్

|

May 27, 2022 | 3:13 PM

ప్రధాని హోదాలో తెలంగాణ(Telangana) కు వచ్చిన మోదీ ఎటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరైనది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ సమస్యలను కేంద్ర మంత్రి....

Telangana: దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఫెయిల్.. కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్
Jaggareddy
Follow us on

ప్రధాని హోదాలో తెలంగాణ(Telangana) కు వచ్చిన మోదీ ఎటువంటి హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరైనది కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ సమస్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) లు ప్రధానికి చెప్పలేదా అని ప్రశ్నించారు. ప్రతీ పేదవాడి అకౌంట్ లో రూ.15లక్షలు వేస్తానన్న హామీ గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బండి సంజయ్ ముస్లింలను వేరు చేస్తూ హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ అలా కాదని, హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ బాగుండాలని కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రధాని రాకకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఎందుకు హాజరుకాలేదన్న జగ్గారెడ్డి, కేసీఆర్, ప్రధాని మోదీలు అండర్ స్టాండింగ్ టూర్ చేపట్టినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డికి రాజకీయాల్లో ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలను కాదని సీఎం కేసీఆర్ ఏమీ చేయలేడని జగ్గా రెడ్డి స్పష్టం చేశారు.

ప్రధానిని కలిసే ధైర్యం లేని బండి సంజయ్ మసీదులను తవ్వుతానడం ప్రజలను రెచ్చగొట్టడమే అవుతుంది. కానీ కాంగ్రెస్ అలా కాదు. హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కేసీఆర్ ను మోదీ, మోదీని కేసీఆర్ తిడితే ప్రజల కడుపు నిండుతుందా. ప్రధాని రాకకు కేసీఆర్ ఏందుకు అటెండ్ కాలేదు. అటెండ్ అయితే రాష్ట్ర సమస్యలపై ప్రధానిని అడిగే అవకాశం వచ్చేది కదా. ముఖ్యమంత్రి అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లా ఉండాలి. ప్రజల ముందు ప్రధానిని నిలదీసిన వ్యక్తి స్టాలిన్. తమిళంలో మాట్లాడుతూనే జీఏస్టీ నిధులు అడిగారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఫెయిల్. ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా సమస్యలు ఉన్నాయి. మేము సమస్యలు చెప్తే వాటిని పరిష్కరించకుండా హరీశ్ రావు రాజకీయ విమర్శలు చేస్తున్నారు.

              – జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి