AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై సరికొత్త విధానంలో.!

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో..

హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై సరికొత్త విధానంలో.!
Revanth Reddy
Ashok Bheemanapalli
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 31, 2024 | 9:29 PM

Share

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్​నిర్వహణ, నియంత్రణపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.

హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం సూచించారు. అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు. పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చకు వచ్చింది. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణనివ్వాలని సూచించారు. ఈలోపు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలని.. తక్షణమే వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు.

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో(పీక్ అవర్స్‌లో) లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సరిపడే సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపట్టాలని సీఎం చెప్పారు. సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకూడదని అన్నారు. టూ వీలర్ ట్రాఫిక్ ఇంటర్సెప్టర్స్‌పై ఎస్ఐలు, కానిస్టేబుళ్లను పంపించి ట్రాఫిక్ జామ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వేలను ఎక్కడెక్కడ నిర్మించాలి. అక్కడున్న సాధ్యాసాధ్యాలను గుర్తించాలని సీఎం అన్నారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమీషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులను సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్కింగ్ సమస్యను అధిగమిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోతాయనే చర్చ జరిగింది. వీలైనన్ని చోట్ల మల్టీలెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని సీఎం అన్నారు. అన్ని విధివిధానాలతో ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు. లే అవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చేటప్పుడు అక్కడ రోడ్లు, పార్కులు, మౌలిక వసతులకు ఎంత స్థలం కేటాయించాలనే ప్రమాణాలు పున: పరిశీలించాలని సీఎం ఆదేశించారు. విశాలమైన రోడ్లు ఉండేలా దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో ఎలాంటి పద్దతులను అనుసరిస్తున్నారో పరిశీలించాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఉండే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు.

విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
ఈ ఆఫర్‌కు భారీ డిమాండ్‌.. అందుకే ఈ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది!
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..