Revanth Reddy: అలా చేస్తేనే సహకారం అందిస్తాం.. సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..

|

Jul 02, 2024 | 2:54 PM

డ్రగ్స్ ముచ్చట వినరావొద్దు.. ఎంతటి వారైన ఉపేంక్షించొద్దు.. తెలంగాణ‌ను డ్రగ్స్ ర‌హిత రాష్ట్రంగా మార్చాలి.. అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే పదే సూచనలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా ఇండస్ట్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Revanth Reddy: అలా చేస్తేనే సహకారం అందిస్తాం.. సినిమా ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్..
Revanth Reddy
Follow us on

డ్రగ్స్ ముచ్చట వినరావొద్దు.. ఎంతటి వారైన ఉపేంక్షించొద్దు.. తెలంగాణ‌ను డ్రగ్స్ ర‌హిత రాష్ట్రంగా మార్చాలి.. అంటూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే డ్రగ్స్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పదే పదే సూచనలిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సినిమా ఇండస్ట్రీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ సైబర్ క్రైమ్ నివారణకు సినిమా ఇండస్ట్రీ తోడ్పడాలంటూ సూచించారు. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

కేవలం సినిమా టికెట్ల ధర పెంపు కోసమో.. లేదా షూటింగుల అనుమతుల కోసం సినీ ప్రముఖులు ప్రభుత్వం దగ్గరకు రావద్దు .. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్త సినిమాల విడుదలకు ముందు సినిమాలో ఉన్న తారలతో డ్రగ్స్‌పై అవగాహన వీడియోలు తయారుచేయాలన్నారు. అలా చేస్తేనే ప్రభుత్వం సహకారం అందిస్తుందని స్పష్టంచేశారు.

‘‘వందల కోట్లు సంపాదిస్తున్నారు.. సమాజానికి కూడా సినిమా ఇండస్ట్రీ మేలు చేయాల్సిందే.. కోట్ల రూపాయలు తీసుకుంటున్నప్పుడు ప్రజల బాగు కోసం సినిమా తారలు అవగాహన వీడియోలు తీయాల్సిందే’’.. – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

రేవంత్ రెడ్డి వీడియో..

థియేటర్లలో డ్రగ్స్‌ నియంత్రణ కోసం ఉచితంగా వీడియో ప్రదర్శించాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని.. డ్రగ్స్ నియంత్రణ కోసం చిరంజీవి వీడియో సందేశం పంపారని గుర్తుచేశారు. దేశంలోని యువత డ్రగ్స్ బారిన పడొద్దని అవగాహన కార్యక్రమంలో భాగమైనందుకు మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నానని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు అలాంటి వాళ్లు చాలా మంది ముందుకు రావాలని.. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న సినిమా వాళ్లు, కొంతైనా తిరిగి ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని.. వాటి నియంత్రణకు కృషిచేయాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..