నీటి పారుదలశాఖపై కేసీఆర్‌ సమీక్ష

|

May 24, 2019 | 8:30 PM

హైదరాబాద్‌: నీటి పారుదలశాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ చర్చించారు. జులై నుంచే కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించనున్న నేపథ్యంలో బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దీనికోసం సమగ్ర వ్యూహం రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ఇకపై […]

నీటి పారుదలశాఖపై కేసీఆర్‌ సమీక్ష
Follow us on

హైదరాబాద్‌: నీటి పారుదలశాఖపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ చర్చించారు. జులై నుంచే కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించనున్న నేపథ్యంలో బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్వహణకు సన్నద్ధం కావాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దీనికోసం సమగ్ర వ్యూహం రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ఇకపై రాష్ట్రంలో నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని అధికారులతో కేసీఆర్‌ పేర్కొన్నారు.