Swathantra Bharata Vajrotsavalu: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏడాది మొత్తం వజ్రోత్సవాలు నిర్వహించింది. ప్రారంభ వేడుకలను ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ పేరిట గతేడాది ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. 15 రోజుల పాటు ప్రతి రోజు ఒక్కో కార్యక్రమం చేపట్టారు అధికారులు. అలాగే.. ఏకకాలంలో, ఎక్కడివాల్లక్కడ ‘తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. తాజాగా.. కోటి వృక్షార్చన పేరిట మొక్కలు నాటారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలకు ప్రభుత్వం ముగింపు పలికింది. అత్యంత వైభవంగా జరిగిన వజ్రోత్సవ ముగింపు ఉత్సవానికి సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అన్నారు సీఎం కేసీఆర్. వజ్రోత్సవ ప్రారంభ వేడుకలను గతేడాది 15 రోజులపాటు ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. గాంధీ మార్గంలో పోరాటం చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వజ్రోత్సవ వేడుకల ద్వారా భారత స్వతంత్ర పోరాట చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు ప్రయత్నించామని కేసీఆర్ వివరించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలలో భాగంగా ఈ రోజు HICC లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి పాల్గొని స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సీఎస్ పలు ముఖ్య అంశాలను తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. #SwathantraBharataVajrotsavalu pic.twitter.com/ZvA7GXHK2l
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) September 1, 2023
మొత్తంగా.. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలతో వజ్రోత్సవాలు సుసంపన్నం అయ్యాయి. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన దేశ భక్తి, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..