Telangana: త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ.. భారత రాష్ట్రీయ సమితి పేరు ఖరారు..!

|

Jun 11, 2022 | 10:57 AM

తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందుకు భారత్‌ రాష్ట్రీయ సమితి పేరు వైపు పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో కొత్త పార్టీను కేసీఆర్ ప్రకటించనున్నారు. తాజా రాజకీయ...

Telangana: త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ.. భారత రాష్ట్రీయ సమితి పేరు ఖరారు..!
Telangana CM KCR
Follow us on

తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందుకు భారత్‌ రాష్ట్రీయ సమితి పేరు వైపు పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఢిల్లీలో కొత్త పార్టీను కేసీఆర్ ప్రకటించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించిన సీఎం.. ఐదు గంటల పాటు సమావేశమయ్యారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో బీజేపీ(BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల కంటే ముందే జాతీయ పార్టీని ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్న కేసీఆర్(CM KCR) ఆ పార్టీ వల్ల దేశం అథోగతి పాలైందని విమర్శించారు. విపక్ష హోదాలో కాంగ్రెస్ విఫలమైనందున దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వివిధ పార్టీలను ఏకం చేసి ఎన్డీయే అభ్యర్థిని ఓడించడం ద్వారా బీజేపీకి తగని గుణపాఠం చెప్పవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ పాలన, పథకాలకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దీన్ని జీర్ణించుకోలేక కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకే కేంద్ర రుణాలపై ఆంక్షలు విధిస్తోంది. దీనిని దీటుగా ఎదుర్కొందాం. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ తరుణంలో వ్యవస్థను చక్కదిద్దేందుకు కొత్త పార్టీ అవసరం ఏర్పడింది.

        – కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించే ప్రతిపాదన వచ్చినప్పటికీ.. కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త పార్టీకి జై భారత్‌, నయాభారత్‌, భారత్‌ రాష్ట్రీయ సమితి తదితర పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. పేరు, జెండా తదితర అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సీఎం కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..