Hyderabad: నగరంలోని గంజాయి ముఠాల గుట్టురట్టు.. ఏకంగా 910 కేజీల సరుకు పట్టివేత..

|

Jun 13, 2023 | 5:50 AM

Hyderabad: మరోసారి గంజాయి అక్రమ రవాణాకు చెక్‌ పెట్టారు హైదరాబాద్‌ పోలీసులు. ఒడిశా నుండి తెలంగాణ మీదుగా తరలిస్తున్న 2 కోట్లకుపైగా విలువైన గంజాయిని సీజ్‌ చేశారు. మూడు కేసుల్లో 8 మందిని అరెస్ట్‌ చేశారు..

Hyderabad: నగరంలోని గంజాయి ముఠాల గుట్టురట్టు.. ఏకంగా 910 కేజీల సరుకు పట్టివేత..
Ganja In Hyderabad
Follow us on

హైదరాబాద్‌లో మరోసారి గంజాయి తరలిస్తున్న ముఠాల గుట్టురట్టయింది. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన మూడు జోన్ల పోలీసులు.. జాయింట్‌ ఆపరేషన్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్, శంషాబాద్, మాదాపూర్, చందానగర్, రాజేంద్రనగర్ SOT పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేశారు. మొత్తం మూడు కేసుల్లో 2.8 కోట్లు విలువ చేసే 910 కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు. మూడు కేసుల్లో 8 మందిని అరెస్ట్ చేశారు. పరారీ ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల్లో ఒకరు గతంలో కూడా అరెస్ట్‌ అయినట్లు పోలీసులు చెప్పారు. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్టుగా గుర్తించారు.

అలాగే నిందితులు తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఒడిశాకు చెందిన వారిగా పోలీసులు తేల్చారు. నిందితులు ఒక కేసులో తౌడ్ తరలిస్తున్నట్లు ప్యాక్ చేసి కింద గంజాయి అమర్చారు. మరో కేసులో గాజుల ప్యాక్ కింద గంజాయిని అమర్చారు. నిందితుల నుంచి ఐదు మొబైల్స్‌, ఒక DCM వ్యాన్‌ను పోలీసులు సీజ్ చేశారు. జీడిమెట్ల, శంషాబాద్‌, చందానగర్‌ల్లో కేసులు నమోదు చేశామన్నారు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..