CISF 54th Rising Day Parade: హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో సీఐఎస్‌ఎఫ్ 54వ రైజింగ్ డే పరేడ్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.
అమరులకు నివాళులర్పించిన అమిత్ షా.. సీఐఎస్‌ఎఫ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. 53 ఏళ్లుగా దేశ సేవలో సీఐఎస్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తున్నదని చెప్పారు. CISFలో డ్రోన్ టెక్నాలజీని మరింత బలోపేతం చేస్తామన్నారు..దేశ సేవలో ప్రాణాలర్పించిన..సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి నివాళులర్పించారు అమిత్‌షా.
1969, మార్చి 10న 3 వేల సిబ్బందితో CISF మొదలైందని, ప్రస్తుతం లక్షా 80 వేల మంది పనిచేస్తున్నారు..దేశానికి పటిష్ఠ భద్రతా సేవలు అందిస్తున్నారు. CISF పోలీసుల వల్లే దేశంలో నక్సలైట్లు, ఉగ్రవాదుల కార్యకలాపాలను అదుపుచేయగలిగారు..ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.